CULTURAL FEAST DURING GAJA VAHANAM _ గజ వాహనసేవలో కళావైభవం
PADMAVATI PADMAJA VAISHANAVI MAHALAKSHMI LEADS THE PARAPHERNALIA
GAJENDRA MOKSHAM DISPLAYED
TIRUMALA, 20 OCTOBER 2023: The pleasant evening on Friday witnessed the grandeur of Navaratri Brahmotsavams in Tirumala with the Paraphernalia for Gaja Vahana seva being led by Padmavathi – Padmaja-Vaishnavi-Mahalakshmi, the luckiest pachyderms of Tirumala temple, marching along the mada streets majestically to the rhythmic beats and colourful dances.
Gajendra Moksham Episode was displayed by the students of TTD’s Sri Venkateswara college of Music and Dance which impressed the devotees.
They also performed Kantara folk Dance which mused the spectators in the galleries.
The Kolatam by Tirumala Balaji Nagar residents team led by Sri Srinivasulu, Nava Durga dance by Sri Muralikrisha troupe of Tirupati attracted the pilgrims.
In total, 400 artistes from 15 teams presented their talents in front of Gaja Vahana Seva.
గజ వాహనసేవలో కళావైభవం
– అలరించిన ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థుల కాంతారా జానపద నృత్యం
తిరుమల, 2023 అక్టోబరు 20: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి గజ వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన అరుదైన కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 15 కళాబృందాల్లో 400 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు.
పద్మావతి, పద్మజ, వైష్ణవి, మహాలక్ష్మి అనే పేర్లు గల తిరుమల ఆలయ గజాలు రాజసంతో ముందుకు నడుస్తుండగా కళా బృందాల కోలాహలం నడుమ గజ వాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది.
ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు గజేంద్రమోక్షం, ఆకట్టుకునే వేషధారణలతో కాంతారా జానపద నృత్యం చక్కగా ప్రదర్శించారు. తిరుపతికి చెందిన వంశీధర్ రెడ్డి బృందం గోపిక నృత్యం, విశాఖపట్నంకు చెందిన బి.సాయిరోజ బృందం యోగచాప్ కోలాటం, మైసూరుకు చెందిన జ్యోతి ఎన్.హెగ్డే బృందం భరతనాట్యం రమణీయంగా సాగింది.
బెంగుళూరుకు ఎన్.నాగేంద్ర బృందం పటకునిత, తిరుపతికి చెందిన
సి.హెచ్.జగదీష్ బృందం శాస్త్రీయ నృత్యం, తిరుపతికి చెందిన కవిత, నెల్లూరుకు చెందిన ఉమారాణి బృందాల కోలాటం, తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపల్లికి చెందిన ఎం.సరస్వతి సన్ ఫ్లవర్ నృత్యం, శ్రీకాకుళానికి చెందిన శోభకుమారి బృందం మయూర నృత్యం, ద్వారంపూడికి చెందిన కె.రాజు బృందం జానపద నృత్యం, విశాఖపట్నంకు చెందిన జె.రజిత బృందం కోలాటం, తిరుమల బాలాజీ నగర్ కు చెందిన కె.శ్రీనివాసులు బృందం కోలాటం, తిరుపతికి చెందిన మురళీకృష్ణ బృందం నవ దుర్గలతో ప్రదర్శించిన నృత్యం అలరించాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.