CULTURAL FIESTA IN SRI PAT BTUs _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

TIRUPATI, 25 NOVEMBER 2022: The annual Karthika Brahmotsavams had given an opportunity to the artists belonging to various traditional arts to showcase their impeccable talents.

On Friday, the Mangaladhwani by Sri Haribabu and Sri Srinivasulu, followed by Veda Parayanam, Dharmic lecture by Smt Ananta Lakshmi, musical vocal by Delhi Sisters, Burra Katha by Sri Prabhakar from Nizamabad, Annamacharya Sankeertans by Sri Udaya Bhaskar, Sri Ravichandra were a few among many others.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

తిరుపతి, 2022 న‌వంబ‌రు 25 ;శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు శ్రీ హరిబాబు, శ్రీ శ్రీనివాసులు బృందం మంగళధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం నిర్వహించారు

ఉదయం 10 నుండి 11 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీమతి అనంతలక్ష్మి ధార్మికోప‌న్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన కళ్యాణి బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ముని లక్ష్మి భాగ‌వ‌తార్‌ హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీమతి విజయలక్ష్మి బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన ఆశ్రిత బృందం అన్నమయ్య సంకీర్తన‌ల‌ను గానం చేశారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుండి చెన్నైకి చెందిన శ్రీకృష్ణ నాట్యాలయ వారిచే నృత్యం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి ఢిల్లీకి చెందిన ఢిల్లీ సిస్టర్స్ బృందం సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద నిజామాబాద్ కు చెందిన శ్రీ ప్రభాకర్ బృందం బుర్రకథ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి తిరుపతికి చెందిన శ్రీ ఉదయ భాస్కర్ మరియు రవిచంద్ర భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.