ALL SET FOR AMMAVARI CELESTIAL PANCHAMI THEETHA FETE- TTD CHAIRMAN _ అమ్మవారి పంచమితీర్థం కు సకల ఏర్పాట్లు

GERMAN SHED SHELTERS, PRASADAM AND DRINKING WATER SUPPLIES ARRANGED

 

Tirupati,25 November 2022: TTD Chairman Sri YV Subba Reddy on Friday evening said that TTD has all arrangements for devotees for the most important celestial Panchami Thirtha fete scheduled on November 28 as part of the ongoing Karthika Brahmotsavam of Tiruchanoor.

 

After participating in the grand Garuda Vahana Seva on Friday night the TTD Chairman told media persons that in connection with the Panchami Thirtha fete, Sare from Tirumala Srivari temple would be presented to Sri Padmavati ammavaru.

 

He said the Panchami Thirtha fete was a significant stage of the Karthika Brahmotsavam of Tiruchanoor temple and the Chakra Snanam would be conducted between 11.40am and 11.50 am.

 

“After a gap of two years due to Covid restrictions, for the first time TTD is conducting the annual fete with the participation of the public and lakhs of devotees are expected to converge on the day of Panchami Thirtha and all arrangements were in place already.

 

He said German sheds are set up for devotees’ convenience at Ayyappa temple, ZP high school and Pudi road where from November 27 night itself provision of Anna Prasadam, tea, coffee and drinking water will be arranged besides toilets, bathrooms, medical camps etc.

 

He said separate queue lines are kept ready to lead devotees directly from sheds to Pushkarini for the holy bath and appealed to devotees to patiently wait for their turn to take the holy dip.

 

“Besides a 2500 strong police force, TTD vigilance staff and 1000 Srivari Sevakulu will guide and assist the devotees to take holy bath and beget the blessings of goddess Padmavati on that auspicious day”, he maintained.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమ్మవారి పంచమితీర్థం కు సకల ఏర్పాట్లు

– భక్తులకు సేద తీరడానికి జర్మన్ షెడ్లు, ఆహారం,తాగునీరు, తేనీరు సరఫరా
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 25 నవంబరు 2022: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన పంచమితీర్థం కార్యక్రమం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

శుక్రవారం రాత్రి జరిగిన అమ్మవారి గరుడ వాహన సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నవంబరు 28వ తేదీ సోమవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందన్నారు.

అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పంచమితీర్థం చాలా విశిష్టమైనదని అన్నారు.
ఆ రోజు ఉదయం 11.40 గంటల నుండి 11.50 గంటల మధ్య పుష్కరిణిలో పంచమితీర్థం చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.

కరోనా తరువాత తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాలలో పంచమితీర్థంకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇదివరకే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు..

తిరుచానూరులోని అయ్యప్ప ఆలయం, జెడ్‌పి హైస్కూల్‌, పూడి రోడ్డు వద్ద భక్తుల విశ్రాంతి కోసం జర్మన్‌ షెడ్లు ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు.

ఈ ప్రాంతాల్లో భక్తులకు 27వ తేదీ రాత్రి నుంచే అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫీ అందుబాటులో ఉంచుతామన్నారు. భక్తులకు అవసరమైన తాత్కాలికమరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఛైర్మన్ వివరించారు.

జర్మన్‌ షెడ్ల నుంచే భక్తులు పుష్కరిణిలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

భక్తులు క్రమపద్ధతిలో పుష్కరిణిలోకి ప్రవేశించి పవిత్రస్నానం ఆచరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భక్తుల భద్రత కోసం 2500 మంది పోలీసు బలగాలతో పాటు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు.

టీటీడీ సిబ్బందితోపాటు దాదాపు 1000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందిస్తారని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులందరూ ఓపికగా ఉండి అధికారులకు సహకరించి పుష్కరిణిలో పుణ్య స్నానం చేయాలని ఆయన కోరారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది