CULTURAL FUSION DURING SIMHA VAHANA SEVA _ సింహ వాహనసేవలో కళా వైభవం

Tirumala, 17 September 2026: Devotees were spellbound by the captivating performances presented by artistes from across the country on Thursday morning.

Cultural troupes from eight states across the country including Andhra Pradesh, Telangana, Maharashtra, Jharkhand, Uttar Pradesh, Uttarakhand, Gujarat and Himachal Pradesh, entertained devotees with traditional art performances during Simha Vahana Seva on Thursday.

Artists presented classical and folk forms including Dasavatharams, Bharatanatyam, Kathak, Kuchipudi, Chhau, Kolatam, Navadurgas, drum ensembles and Sri Rama Charitam.

A total of 19 troupes with 494 artists participated in these TTD-organised cultural programmes, adding spiritual vibrancy to the Brahmotsavams.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

సింహ వాహనసేవలో కళా వైభవం

8 రాష్ట్రాల నుంచి 19 కళాబృందాలు – 494 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు

తిరుమల, 2026 సెప్టెంబరు 17: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వైభవంగా జరిగిన సింహ వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ, జానపద కళారూపాలను ప్రదర్శించి భక్తులను విశేషంగా అలరించారు. స్వామివారి వాహనసేవకు కళాకారుల ప్రదర్శనలు భక్తిభావాన్ని, సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేశాయి.

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు పాల్గొన్నాయి. మొత్తం 19 కళాబృందాలకు చెందిన 494 మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

శాస్త్రీయ, జానపద కళల సమ్మేళనం

శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల కళాకారులు దశావతారాలు, భరతనాట్యం, కథక్, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు.

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గౌరసూర్ బోద్/చౌ, జానపద నృత్యాలు, డ్రమ్స్, కోలాటం తదితర సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించారు.

అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో చౌలియా, మేవశిరాస్, జానపద నృత్యం, గోందల్ నృత్యం వంటి వైవిధ్యభరిత సంప్రదాయ కళారూపాలు కనువిందు చేశాయి.

దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళములతో జానపద నృత్యం, డ్రమ్స్, నవదుర్గలు, శ్రీరామ చరితం, కోలాటం తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు.

భక్తి.. కళ.. భారతీయ సంస్కృతి..!

శ్రీవారి సింహ వాహనసేవలో 19 కళాబృందాలకు చెందిన 494 మంది కళాకారులు పాల్గొని తమ అద్భుతమైన కళా ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ కళారూపాలు తిరుమలలో భక్తి, కళ, భారతీయ సంస్కృతుల సమ్మేళనాన్ని ఆవిష్కరించాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల సాంప్రదాయ, జానపద కళారూపాలకు వేదిక కల్పిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు భారతీయ కళా వైవిధ్యాన్ని పరిచయం చేస్తున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.