CULTURAL PROGRAMMES STEAL THE HEARTS OF DENIZENS _శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భ‌క్తిభావం పంచుతున్న సాంస్కృతిక కార్యక్రమం

Tirupati, 26 Nov. 19: The devotional cultural programs mulled by TTD have been providing an artistic experience to the denizens during the ongoing brahmotsavams of Sri Padmavati Devi Temple at Tiruchanoor with the objective to elevate the devotional and spiritual quotient among devotees.

In the last four days the cultural wings of TTD like HDPP, Annamacharya Project, Dasa Sahitya Project and SV music and dance College and SVIHVS have organized variety of programs at the Asthana mandapam and other venues through out the day.

At the Asthana Mandapam of Tiruchanoor, the team of Smt Lakshmi Suvarna of Tirupati rendered Mangala dwani and Acharya Sri K Sarvottameswar Rao presented dharmic discourse followed Bhakti sangeet by Sri Srivalli team of Vijayawada.

In the afternoon Smt Purna team of Tirupati presented harikatha Parayanam and Smt Tejaswini team recited Annamaiah vinnapalu, which was followed by Sri A S Girish team of Tirupati who rendered Annamaiah sankeertans during unjal seva.

Likewise the team of Smt Srivall presented chorus sangeet at Mahati auditorium and Sri Manya Chandran rendered Bhakti sangeet at Annamacharya Kala Mandir. 

Later on at Ramachandra Pushkarani, the Sri Lakshmi team from Hyderabad rendered Nama sankeertans. Lastly Smt N Sumedha troupe of Chennai enthralled the audience at the Shilparamam on Tiruchanoor Road with their Bhakti sangeet.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI 

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భ‌క్తిభావం పంచుతున్న సాంస్కృతిక కార్యక్రమం

తిరుపతి, 2019 న‌వంబ‌రు 26: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మంగ‌ళ‌వారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భ‌క్తిభావాన్ని పంచాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల‌, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వర్యంలో వివిధ వేదిక‌ల‌పై ఏర్పాటుచేసిన‌ కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి బి.ల‌క్ష్మీసువ‌ర్ణ బృందం మంగళధ్వని, ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఆచార్య కె.స‌ర్వోత్త‌మ‌రావు ధార్మికోప‌న్యాసం చేశారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీ‌మ‌తి ఎన్‌.శ్రీ‌వ‌ల్లి బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వ‌హించారు.
 
అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి పూర్ణ బృందం హరికథ పారాయణం చేశారు. కాగా సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన తేజ‌శ్విని బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజల్‌ సేవలో తిరుప‌తికి చెందిన ఎఎస్‌.గిరీష్ బృందం సంకీర్తన‌ల‌ను గానం చేయ‌నున్నారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఎస్‌.శ్రీ‌వాణి బృందం సంగీత కార్య‌క్ర‌మం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఎ.మాన్య‌చంద్ర‌న్ బృందం భక్తి సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ బి.లక్ష్మి బృందం నామ‌సంకీర్త‌నం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌న్నున్నారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ ఎం.సుమేధ బృందం సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.