ARTFORMS ENTHRALLS _ సర్వభూపాల వాహన సేవలో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శన
TIRUPATI, 03 DECEMBER 2024: The performances of various artists in front of Sarvabhoopala Vahanam on sixth morning enthralled devotees.
The students of SV College of Music and Dance have been presenting a unique display of mythological themes in front of every vahanam attracting the devout attention.
Today the students displayed Asta Dikpalakas which stood as a cynosure.
A total of 254 artistes belonging to a dozen teams hailing from AP, TS and Karnataka presented their skills in the morning vahana seva.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సర్వభూపాల వాహన సేవలో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శన
తిరుపతి, 2024 డిసెంబరు 03: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన మంగళవారం ఉదయం సర్వభూపాల వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఆంధ్ర రాష్ట్రంతో పాటు, తెలంగాణ, కర్నాటక రాష్టాలకు చెందిన 12 కళా బృందాలలో 254మంది కళాకారులు వారి వారి కళారూపాలతో అమ్మవారిని సేవించుకున్నారు.
తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రతి వాహనం ముందు పౌరాణిక ఇతివృత్తాల విశిష్ట ప్రదర్శనను ప్రదర్శిస్తూ భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ రోజు విద్యార్థులు అష్ట దిక్పాలకులు, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శించారు.
రాజమండ్రికి చెందిన 30 మంది కళాకారులు సాంప్రదాయ డమరుకం – గిరిజన నృత్యం, తెలంగాణకు 26 మంది కళాకారుల బోనం – కోలాటం, లంబాడి డ్యాన్స్, కడపకు చెందిన బాబు బృందం కడప డ్రమ్స్ భక్తులను అలరించాయి. అదేవిధంగా బెంగుళూరుకు చెందిన నృత్య గంగా కళా కేంద్రంకు చెందిన 25 మంది యువతులు శ్రీ మాత నమః నృత్యం, తిరుపతికి చెందిన 28 మంది దాస సాహిత్య కాళకారులు రాధక్రిష్ణ నృత్యం, కోలాటాలు నేత్రపర్వంగా సాగాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది