CVSO INSPECTS FOUR MADA STREETS _ శ్రీవారి ఆలయ మాఢ వీధులను పరిశీలించిన సివిఎస్వో
Tirumala, 26 August 2024: The chief vigilance and security officer of TTD inspected four mada streets to assess the movement of vahana sevas during the ensuing annual Brahmotsavams along with other officials on Monday.
As a part of his inspection, he verified the starting point at Vahana Mandapam, rope parties, the exit and entry points, especially on the day of Garuda seva and related issues and made valuable suggestions to the respective officials.
EEs Sri Subramanyam, Sri Sudhakar, DyEO Health Smt Asha Jyothi, Health Officer Sri Madhusudhan Prasad, VGOs Sri Nandakishore, Sri Surendra, Sri Ramkumar, temple AVSO Sri Manohar and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయ మాఢ వీధులను పరిశీలించిన సివిఎస్వో
తిరుమల, 2024 ఆగష్టు 26: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోమవారం టిటిడి సివిఎస్వో శ్రీ శ్రీధర్, అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా సివిఎస్వో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వాహనమండపం, భక్తులు గ్యాలరీలలోనికి వచ్చేందుకు మాడ వీధులలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, గ్యాలరీలలోని ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాల పార్కింగ్, తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈఈలు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ సుధాకర్, డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, ఆర్యోగ శాఖ అధికారి డా.మధుసూదన్ రావు, విజివోలు శ్రీ సురేంద్ర, శ్రీ రామ్ కుమార్, శ్రీ నంద కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.