DANCE TROUPES ENHANCE GRANDEUR OF VAHANA SEVAS_ సూర్య‌ప్ర‌భ వాహ‌న‌సేవ‌లో క‌ళానీరాజ‌నం

Tirumala, 6 October 2019: The art forms performed infront of Surya Prabha and Chandra Prabha Vahana sevas enhanced the grandeur of the carriers along mada streets on Sunday.

The 20 member team of Srinivasa Yuva Bhajan Mandali presented  Bihu Dance led by Smt Vijayaprakash of Chikmagalur in Karnataka with avatars of Krishna and Mirabai.

The Chanda mela from Udupi enthralled devotees with rhythmic drum beating and step dance.

The unique Pandava dance was presented by 15 member team of Uttarakhand. Wherein the artistes portrayed the characters of Mahabharata.

While the artists from Uttarpradesh presented Bundelroy dance with Dolak, Tabla and Drums is the traditional art presented during fairs and festivals.

The  15 member artists team from  Visakhapatnam,  led by Smt Rajarajeshwari presented kolatas with Annamacharya sankeertans.

The 50 members of Sri Seshadri Nasik dol team from Nidadavolu inWest Godavari District presented exciting Dol Dance.T hey were followed by folk dancers and Kolatas from AP and Telangana.

Apart from these artforms,  Manipuri dance, Rajasthan Dol dance,  Gujrati folk dance stolen the limelight.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సూర్య‌ప్ర‌భ వాహ‌న‌సేవ‌లో క‌ళానీరాజ‌నం

అక్టోబరు 06, తిరుమల, 2019:  శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉద‌యం సూర్య‌ప్ర‌భ వాహ‌న‌సేవ‌లో క‌ళాకారులు వివిధ క‌ళారూపాల‌తో శ్రీ‌నివాసుని నీరాజ‌నం స‌మ‌ర్పించారు. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, దాస‌సాహిత్య ప్రాజెక్టు, అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.

క‌ర్ణాట‌క నుండి బిహు నృత్యం
 
క‌ర్ణాట‌క‌లోని చిక్‌మంగ‌ళూరు నుండి శ్రీ శ్రీ‌నివాస యువ భ‌జ‌న‌మండ‌లికి చెందిన శ్రీమ‌తి విజ‌య‌ప్ర‌కాష్ నేతృత్వంలో 29 మంది క‌ళాకారులు ఆస్సామీ సంప్ర‌దాయంలో బిహు నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇందులో శ్రీ‌కృష్ణుడు, మీరాబాయి వేష‌ధార‌ణ‌లు ఆక‌ట్టుకున్నాయి. ఈ క‌ళాకారుల్లో ప‌లువురు డాక్ట‌ర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉండ‌డం విశేషం.

ఉడిపి నుండి చండ‌మేళం
 
క‌ర్ణాట‌క రాష్ట్రం ఉడిపిలోని ప‌లిమారు మ‌ఠానికి చెందిన 15 మంది క‌ళాకారులు చండ‌మేళం వాయించారు.  వీరు ముందుకు వెన‌క్కి అడుగులు వేస్తూ ల‌య‌బ‌ద్ధంగా వాయిద్య విన్యాసం చేశారు.

ఉత్తరాఖండ్ నుండి పాండ‌వ్‌ నృత్యం

 ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన 15 మంది క‌ళాకారులు పాండ‌వ్ నృత్యాన్ని అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు. టీమ్ లీడ‌ర్ శ్రీ అభిషేక్ ఆధ్వ‌ర్యంలో వీరు వెదురుబుట్ట‌ల‌ను అటు ఇటు క‌దిలిస్తూ స్థానిక జాన‌ప‌ద శైలిలో నృత్యం చేశారు.

ఉత్తరప్రదేశ్ నుండి బుందేలి రాయ్ నృత్యం

ఉత్తరప్రదేశ్ నుండి శ్రీ‌మ‌తి వంద‌న కుష్వ‌హ ఆధ్వ‌ర్యంలోని 15 మంది స్థానిక సంప్ర‌దాయంలో బుందేలి రాయ్ నృత్యంతో అల‌రించారు. వీరు డోల్‌, డోలక్‌, న‌వ‌డియా, త‌బ్‌లా త‌దిత‌ర వాయిద్యాల‌ను వినియోగించారు.

అనంత‌పురం నుండి ఉరుముల వాద్యం

అనంత‌పురం జిల్లా ఆత్మ‌కూరు మండ‌లం స‌న‌ప గ్రామానికి చెందిన శ్రీ యువ ఉరుముల క‌ళాకారుల సంఘం నుండి శ్రీ ఎం.బుచ్చిబాబు ఆధ్వ‌ర్యంలో 20 మంది క‌ళాకారులు ఉరుముల వాద్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. డోలు లాంటి వాయిద్యంపై ఈ వాద్య విన్యాసం చేశారు.

విశాఖ నుండి కోలాటం

 విశాఖ‌ప‌ట్నంకు చెందిన శ్రీమ‌తి రాజ‌రాజేశ్వ‌రి ఆధ్వ‌ర్యంలోని 16 మంది మ‌హిళలు చ‌క్క‌గా కోలాటం ప్ర‌ద‌ర్శించారు. వీరు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌తో శ్రీ‌వారిని కీర్తిస్తూ కోలాట నృత్యం చేశారు.

శ్రీ శేషాద్రి నాసిక్ డోల్
 
 ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలుకు చెందిన శ్రీ శేషాద్రి నాసిక్ డోల్ బృందం ప్ర‌తినిధి శ్రీ శ్రీ‌కృష్ణ స‌త్య ఆధ్వ‌ర్యంలో 50 మంది క‌ళాకారులు పెద్ద డోళ్ల‌తో చ‌క్క‌టి విన్యాసం చేశారు. అదేవిధంగా, ఏపీ, తెలంగాణకు చెందిన పలు బృందాలు కోలాటం, జానపద నృత్యం ప్రదర్శించారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.