BHAJANS RESOUND ON MADA GALLERIES _ మాడ వీధుల్లో భ‌జ‌న‌ల‌తో మార్మోగుతున్న గ్యాల‌రీలు

Tirumala, 6 October 2019: The devotees in the galleries of four Mada streets of Srivari temple were immersed in the devotional fountain to a bonanza of bhajans during ongoing annual Brahmotsavams.

TTD had setup bhajan mandapams in all the corners of four Mada streets titled as Annamaiah, Purandhara Dasa, Tarigonda Vengamamba, Pedda Thirumalaiah and Thyagayya to showcase the bhajans to thousands of devotees who have been sitting in galleries all through the day to see vahana sevas. a

Eight teams of 20 artists each rendered bhajans for two days consecutively.

As devotees waited for Vahanam, bhajan artists entertained them with Bhakti sangeet presented by Dasa Sahitya Project, Annamacharya Project etc during ongoing annual brahmotsavams.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

మాడ వీధుల్లో భ‌జ‌న‌ల‌తో మార్మోగుతున్న గ్యాల‌రీలు

అక్టోబరు 06, తిరుమ‌ల‌, 2019: అన్న‌మ‌య్య, పురంద‌రదాస, త‌రిగొండ వెంగ‌మాంబ, పెద్ద‌తిరుమ‌ల‌య్య‌, త్యాగ‌య్య పేర్ల‌తో వేదిక‌లు

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించేందుకు విచ్చేసే భ‌క్తుల కోసం ఆల‌య మాడ వీధుల్లో టిటిడి భ‌జ‌న మండ‌పాలు ఏర్పాటుచేసింది. ఉద‌యం, రాత్రి వాహ‌న‌సేవ‌ల స‌మ‌యంలో ఇక్క‌డి క‌ళాకారుల భ‌జ‌న‌ల‌తో గ్యాల‌రీలు మారుమోగుతున్నాయి.

భ‌క్తులు గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో వాహ‌న‌సేవ‌ల్లో స్వామివారిని ద‌ర్శించుకుంటున్నారు. శ్రీ‌వారిపై అచంచ‌ల‌మైన భ‌క్తి విశ్వాసాల‌తో కీర్త‌న‌లు ర‌చించి భ‌క్త‌లోకానికి అందించిన ప్ర‌ముఖ వాగ్గేయ‌కారులైన శ్రీ అన్న‌మ‌య్య, శ్రీ‌ పురంద‌రదాస, శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ, శ్రీ పెద్ద‌తిరుమ‌ల‌య్య‌, శ్రీ త్యాగ‌య్య పేర్ల‌తో వేదిక‌లు ఏర్పాటుచేశారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో వీటిని ఏర్పాటుచేశారు.

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వ‌ర్యంలో మేద‌ర‌మిట్ట వ‌ద్ద శ్రీ త్యాగ‌య్య మండ‌పం, ప‌డ‌మ‌ర మాడ వీధిలో శ్రీ పెద్ద తిరుమ‌ల‌య్య మండ‌పం ఉన్నాయి. ఒక్కో మండ‌పంలో 20 మంది క‌ళాకారులు రెండు రోజుల చొప్పున‌ భ‌జ‌న కీర్త‌న‌లు ఆల‌పిస్తారు. ఈ విధంగా వాహ‌న‌సేవ‌లు జ‌రిగే 8 రోజుల్లో 8 భ‌జ‌న బృందాల్లో క‌ళాకారులు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఉత్త‌ర మాడ వీధిలో శ్రీ‌వ‌రాహ‌స్వామివారి ఆల‌యం ఎదురుగా శ్రీ పురంద‌ర‌దాస మండ‌పం, అర్చ‌క భ‌వ‌నం స‌మీపంలో శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ మండ‌పం ఏర్పాటుచేశారు. ఒక్కో మండ‌పంలో 20 మంది క‌ళాకారులు రెండు రోజుల చొప్పున‌ భ‌జ‌న కీర్త‌న‌లు ఆల‌పిస్తున్నారు.

అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ద‌క్షిణ మాడ వీధిలో శ్రీ అన్నమ‌య్య మండ‌పం ఏర్పాటుచేశారు. ఇక్క‌డ అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల ఆలాప‌న‌, హ‌రిక‌థ వినిపిస్తున్నారు.

టిటిడి  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.