DARSHAN OF LORD IS A COMPLETE NEW EXPERIENCE-CJI _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ‌ర‌ద్  అర‌వింద్ బాబ్డే

Tirumala, 24 Nov. 19: “I have been visiting the temple of Lord Venkateswara from the past forty years but this time, it was totally a new experience for me”, expressed, the Honourable Chief Justice of India, Justice Sharad Arvind Bobde who is on his maiden visit to Tirumala in the capacity of CJI.

Earlier the CJI given a traditional warm welcome with Isthikaphal by the temple priests and he was received by TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy on his arrival at the main entrance of the Tirumala temple.

Later along with his son Sri Shrinivas Bobde, the CJI offered prayers to Lord Venakteswara in the sanctum sanctorum along on Sunday. The Chief Justice of High Court of Andhra Pradesh, Justice Sri Jitendra Kumar Maheshwari also accompanied the CJI during darshan.

After darshan, the temple priests at Ranganayakula Mandapam offered Vedasirvachanam the CJI. The Chairman, EO and Additional EO offered Thirtha Prasadams, lamination photo of Lord Venkateswara to the dignitary. 

Sharing his experience of darshan, the CJI said, “it was really a great experience to have darshan and blessings of Lord Venkateswara in the capacity of CJI. The temple and its precincts, the architecture, the serene environs gives a soothing feel and positive energy. The maintenance of the temple by the TTD authorities is laudable”, he expressed.

Tirupati Urban SP Sri Gajarao Bhupal, Temple DyEO Sri Harindranath and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ‌ర‌ద్  అర‌వింద్ బాబ్డే

 తిరుమ‌ల‌, 2019 న‌వంబ‌రు 24: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ శ‌ర‌ద్  అర‌వింద్ బాబ్డే ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ శ‌ర‌ద్  అర‌వింద్ బాబ్డేకు  టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య అర్చ‌కులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. తరువాత తన కుమారుడు శ్రీ శ్రీనివాస్ బొబ్డేతో పాటు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. గౌ|| ప్రధాన న్యాయమూర్తితో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ జితేంద్ర కుమార్ మహేశ్వరి కూడా ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌ|| ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఛైర్మ‌న్, ఈవో, అద‌న‌పు ఈవో శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సంద‌ర్భంగా గౌ|| ప్రధాన న్యాయమూర్తి మాట్లడుతూ  ” గత నలభై సంవత్సరాల నుండి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శిస్తున్న‌ట్లు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి గా శ్రీ‌వారిని దర్శించుకుని, స్వామివారి ఆశీర్వాదం పొందడం నిజంగా గొప్ప అనుభవమ‌న్నారు. శ్రీ‌వారి ఆలయం, ప‌రిస‌రాలు, శిల్ప సౌoద‌ర్యం కొత్త‌ అనుభూతిని ఇస్తాయ‌న్నారు. టిటిడి అధికారులు శ్రీ‌వారి ఆలయం నిర్వహణ తీరు ప్రశంసనీయం ” అని ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ గజారావ్ భూపాల్, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్ శ్రీ లోక‌నాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.