DD TOKENS AT BHUDEVI COMPLEX _ భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు

SSD TOKEN COUNTER SHIFTED TO VISHNU NIVASAM

TIRUMALA, 13 APRIL 2023: TTD has brought some changes in the issuance of SSD and DD tokens to devotees in Tirupati.

The devotees who wish to trek along the Alipiri Footpath route will be issued tokens in Bhudevi Complex alone. After getting the tokens, they will have to scan the tokens at the 2083rd step at Alipiri Footpath, failing which will not be provided darshan.

Similarly, the devotees who received Divya Darshan (DD) tokens at Bhudevi Complex are eligible for darshan only if they reach Tirumala through the Alipiri Foot Path route and not the other footpath or by other means of transportation.

Whereas, the devotees trekking Srivari Mettu Footpath will be issued tokens at the 1240th step in that route as usual.

For the devotees reaching Tirumala by road, Slotted Sarva Darshan (SSD) tokens will be issued at Srinivasam, Vishnu Nivasam and Govindaraja Swamy Choultries in Tirupati.

The devotees are requested to make note of these facilities and guidelines and plan their pilgrimage to Tirumala accordingly.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు

– ఎస్.ఎస్.డి టోకెన్ కౌంటర్ విష్ణునివాసానికి తరలింపు

తిరుమల, 13 ఏప్రిల్ 2023: తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించబడరు.

భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.

వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తులకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.