SVVU ACADEMIC COUNCIL MEET HELD _ ఎస్వీ వేద వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సమావేశం

TIRUPATI, 13 APRIL 2023: The academic council meet of Sri Venkateswara Vedic University was held on Thursday.

Varsity VC Sri Ranisadasiva Murty chaired the meeting which was also attended by TTD JEO for Health and Education Smt Sada Bhargavi, National Sanskrit Varsity VC Sri. Krishnamurthy and DEO Sri Bhaskar Reddy.

Some important decisions

To conduct the Seventh Convocation of the University soon and confer Maha Mahopadhyaya title to two versatile vedic exponents

To bring all the Veda Pathasalas of TTD under the umbrella of Varsity

To introduce two new courses, Agama Abhigna and Pourohitya Abhigna in Intermediate level

To introduce IKS-Indian Knowledge System courses

To ink pact with Delhi based Akshardham Swami Narayan Trust on knowledge-sharing

Stalwarts from Vedic Studies, Deans, Principals of Dharmagiri and vedic schools and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఎస్వీ వేద వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సమావేశం

తిరుపతి, 13 ఏప్రిల్ 2023: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ సమావేశం గురువారం సాయంత్రం జరిగింది. వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, జాతీయ సంస్కృత వర్సిటీ ఉపకులపతి ఆచార్య కృష్ణమూర్తి, డిఈవో శ్రీ భాస్కర్‌రెడ్డి ఉన్నారు.

ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు

– త్వరలో విశ్వవిద్యాలయం ఏడవ స్నాతకోత్సవాన్ని నిర్వహించి ఇద్దరు బహుముఖ వేద పండితులకు మహా మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేస్తారు.

– టీటీడీలోని అన్ని వేదపాఠశాలలను వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తారు.

– ఇంటర్మీడియట్ స్థాయిలో ఆగమ అభిగ్న, పౌరోహిత్య అభిగ్న కోర్సులను ప్రవేశపెడతారు.

– IKS-ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కోర్సులను ప్రవేశపెడతారు.

– ఢిల్లీకి చెందిన అక్షరధామ్ స్వామి నారాయణ్ ట్రస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుని విజ్ఞానాన్ని పంచుకుంటారు.

ప్రముఖ వేదపండితులు, డీన్లు, ధర్మగిరి, ఇతర వేద పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.