DECLARE GOMATA AS NATIONAL ANIMAL- BABA RAMDEV _ గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి- జాతీయ గో సమ్మేళనం లో శ్రీ బాబా రాందేవ్

Tirupati, 31 Oct. 21: Yoga guru and chief of Patanjali peetham, Baba Ramdev has demanded that the Go matha should be declared as the national animal.

 
 
Addressing the valedictory of the two day Go Maha Sammelan organized by TTD at the Mahati Auditorium, the champion of swadeshi products and organic farming said the Prime Minister Narendra Modi and Home Minister Amit Shah should bring out legislation of Gomatha as national animal as proposed by the TTD Trust board. 

 

 

He said the Patanjali Peetham is always at the forefront Go Samrakshana campaign and was confident that the resolutions of the conference should resound among all. Cow lovers.

 

 

He said the AP CM Sri YS Jaganmohan Reddy informed him about the TTD Go Sammelan program and his participation.

 

 

Baba also lauded all the TTD programs for Hindu Dharmic propagation and particularly the efforts of TTD chairman Sri YV Subba Reddy.

 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి
– జాతీయ గో సమ్మేళనం లో శ్రీ బాబా రాందేవ్

తిరుపతి 31 అక్టోబరు 2021: గోమాత ను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి పీఠం వ్యవస్థాపకులు శ్రీ బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గో సమ్మేళనం ముగింపు సభలో ఆదివారం ఆయన ప్రసంగించారు.

టీటీడీ పాలకమండలి ప్రతిపాదించిన విధంగా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేలా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, హోం మంత్రి శ్రీఅమిత్ షా యథాతథంగా చట్టం చేయాలని కోరారు. దేశంలోని ముఖ్యమంత్రులందరూ టీటీడీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి సహకరించాలని ఆయన కోరారు. గో సంరక్షణకు పతంజలి పీఠం ఎప్పుడూ ముందుంటుందని ఆయన చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన గో సమ్మేళనం చేసిన ఈ విజ్ఞప్తి వారిద్దరి చెవిలో చేరేలా గో ప్రేమికులు నినదించాలన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్వహిస్తున్న హిందూ ధార్మిక కార్యక్రమాలను ఆయన అభినందించారు. పాలక మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. టీటీడీ తలపెట్టిన గో సంరక్షణ యజ్ఞం అందరూ ముందుకు తీసుకు పోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఫోన్ చేసి గో సంరక్ష కార్యక్రమం గురించి తెలియ జేశారని శ్రీ రాందేవ్ బాబా వివరించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది