“DEEPAVALI ASTHANAM”_ ఈనెల 17వ తేదిన దీపావళి ఆస్థానం

Tirupati, October 15, 2009: The Annual Deepavali Asthanam will be performed in the Temple of Lord Sri Venkateswara Swamy, Tirumala on October 17.

In view of the Deepavali Asthanam on October 17, Arjitha Sevas such as Thomala, Archana, Kalyanotsavam, Unjal Seva, Vasanthotsavams are cancelled. However, Suprabhatham, Sahasra Deepalankara Seva will be performed as usual.

Special programmes will also be arranged in Sri Vari Temple on this occasion.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఈనెల 17వ తేదిన దీపావళి ఆస్థానం

తిరుపతి, అక్టోబర్‌-15, 2009: ఈనెల 17వ తేదిన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంనందు దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.

ప్రతి ఏడాది దీపావళి పర్వదినాన శ్రీవారి ఆలయంనందు సాలకట్ల దీపావళి ఆస్థానం నిర్వహించడం సంప్రదాయంగా జరుగుతున్నది. దీపావళి ఆస్థానం పురస్కరించుకొని ఈనెల 17వ తేదిన శనివారం శ్రీవారికి నిత్యం నిర్వహించే ఆర్జితసేవలైన తోమాల, అర్చన, కల్యాణోత్సవం, ఊంజలసేవ, వసంతోత్సవం, తదితర సేవలను రద్దుచేశారు. సుప్రభాతం, సహస్ర దీపాళంకరణ సేవలు కొనసాగుతాయి.

ఈ ఉత్సవం సందర్భంగా బంగారు వాకిలి ముందు శ్రీమలయప్పస్వామి వారికి ఆస్థానం జరుగుతుంది. ఆలయంలో యథాక్రమంగా మొదటి ఘంట నివేదన పూర్తి అయిన తరువాత బంగారు వాకిలి ముందు సర్వభూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని వేంచేపు చేస్తారు. మరొక పీఠంపై విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసిన తర్వాత ఘనంగా నూతన వస్త్ర సమర్పణ, నివేదనలు జరిగిన తర్వాత అక్షతారోపణ చేస్తారు. చివరగా ఘనంగా హారతులు సమర్పించిన తర్వాత తీర్థ చందన, శఠారి వితరణతో దీపావళి ఆస్థానం ముగుస్తుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.