DEVELOPMENTAL WORKS OF SV MUSEUM REVIEWED_ టిటిడి ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై జెఈవో సమీక్ష
Tirumala, 1 December 2018: The developmental works which are completed in SV Museum at Tirumala was reviewed in detail on Saturday.
Tirumala JEO Sri KS Sreenivasa Raju held a detail review meeting with Chief Museum Officer Col.Chandrasekhar Manda at Annamaiah Bhavan.
The JEO directed the officers who were present in the meeting to come out with a constructive micro level plan to develop SV Museum into a world class model.
The SV Museum chief briefed the JEO about the needed measures to be taken for the upliftment of the Museum.
SE II Sri Ramachandra Reddy, CAO Sri Seshasailendra, SE Electrical Sri Venkateswarulu, VGO Smt Sada Lakshmi, PRO Dr T Ravi and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడి ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై జెఈవో సమీక్ష
తిరుమల, 2018 డిసెంబరు 01: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై శనివారం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం నాడు ముఖ్య మ్యూజియం అధికారి కల్నల్ చంద్రశేఖర్ మండతో వివరణాత్మకంగా చర్చించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఎస్వీ మ్యూజియాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నిర్మాణాత్మకంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అనంతరం మ్యూజియం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలను జెఈవోకు ముఖ్య మ్యూజియం అధికారి తెలియజేశారు.
ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, విఎస్‌వో శ్రీమతి సదాలక్ష్మి, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.