DEVOTIONAL PROGRAMS MUSE PILGRIMS _ నాదనీరాజనం వేదికపై ఆక‌ట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

Tirumala, 6 October 2019: Its a day of devotional cultural fervour in Tirumala on Sunday.

As part of ongoing Srivari annual Brahmotsavams, the  cultural wing of TTD including HDPP, Annamacharya Project, Dasa Sahitya Project and SV College if dance and music have organised the devotional programs.

The Team of Sri K Eshwaraiah presented Mangaladwani,followed by Chaturveda Parayanam.  Later the Vishnu Sahasra Namam was rendered by team of Smt Kamakshi of Tirupati.

In the evening the Hyderabad team lead by Smt Y Ramaprabha presented Annamacharya sankeertan during Unjal seva followed  by harikatha Parayanam by Smt Krishna Kumari bhagavathiyar team of Tirupati. 

Earlier in Annamaiah Vinnapalu, Dr Balakrishna Prasad and Smt Bullemma duo presented some noteworthy notes of Annamaiah sankeertans which enthralled the music lovers.

At the Asthana mandapam, the Sri KV Krishna team thrilled the devotees with Bhakti sangeet.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

నాదనీరాజనం వేదికపై ఆక‌ట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుమ‌ల‌, 2019  అక్టోబరు 06;  శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

        ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 5 నుండి 5.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ కె.ఈశ్వ‌ర‌య్య‌ బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి కె.కామాక్షి బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు గుంటూరుకు చెందిన శ్రీ పి.వి.గౌరిశంక‌ర్‌ ధార్మికోపన్యాసం చేశారు.

 మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ జి.బాల‌కృష్ణ ప్ర‌సాద్‌ బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ కూచిపూడి క‌ళాకారిణి ప‌ద్మ‌శ్రీ శోభానాయుడు  బృందం కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు.  సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన శ్రీమతి వై.ర‌మాప్ర‌భ‌ బృందం ఊంజల్‌సేవలో అన్నమాచార్య సంకీర్తనలను వీనుల‌విందుగా గానం చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి జె.కృష్ణ‌కుమారి భాగ‌వ‌తారిణి హరికథ పారాయణం చేశారు.

 అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో ఆదివారం ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ కె.వి.కృష్ణ‌ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.