VEDAS GIVE RIGHTEOUS DIRECTION TO THE SOCIETY- AP CS SRI LV SUBRAHMANYAM_ వేదం స‌మాజానికి ద‌శ – దిశ నిర్ధేశం చేస్తుంది : రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎల్‌.వి.సుబ్ర‌హ్మ‌ణ్యం

Tirumala, 6 October 2019: The Chief Secretary of Andhra Pradesh Sri LV Subrahmanyam said that the intrinsic value of ancient knowledge of Vedas is to show a righteous path for well being of the entire society.

Participating in the Srinivasa Veda Vidwat Sadassu held at Asthana Mandapam on Sunday as a part of the ongoing annual Srivari Brahmotsavams conducted under the aegis of SV Higher Vedic Studies wing of TTD,  the chief secretary said Vedas guided the individual from darkness to wisdom besides providing personality development.

He called for the promotion of Vedic studies and nurturing of Vedic pundits to spread the message of Vedas to society.

Later Acharya Dharmendra Kumar Shastri, Secretary of National Sanskrit Academy,  Delhi gave an inspiring lecture on Vedic Dharma.

Vice-chancellor of SV Vedic Varsity Acharya Sannidhanam Sudarshana Sharma and SVHVS  Project Officer Dr. Akella Vibhishana Sharma participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

వేదం స‌మాజానికి ద‌శ – దిశ నిర్ధేశం చేస్తుంది  : రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎల్‌.వి.సుబ్ర‌హ్మ‌ణ్యం
               
తిరుమల, 2019 అక్టోబ‌రు 06:   వేద విజ్ఞానం వేలాది సంవ‌త్స‌రాలుగా స‌మాజానికి ద‌శ‌- దిశ నిర్ధేశం చేస్తుంద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎల్‌.వి.సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో జ‌రుగుతున్న శ్రీ‌నివాస వేద విద్వ‌త్ స‌ద‌స్సులో ఆదివారం ఉద‌యం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మాట్లాడుతూ భార‌త‌దేశంలో వేల సంవ‌త్స‌రాల నుండి వేద విజ్ఞానం ప‌రిఢ‌విల్లుతోంద‌ని, వేదం లేని భార‌తీయ స‌మాజాన్ని ఊహించ‌లేమ‌న్నారు. వేదం అజ్ఞానంలో ఉండే మాన‌వుడిని విజ్ఞానం వైపు న‌డిపించ‌డంతో పాటు సంస్కారం అందించి, స‌ర్వోన్న‌తుడైన మ‌హోన్న‌త వ్య‌క్తిగా తీర్చిదిద్దుతుంద‌న్నారు. వైదిక స‌త్య‌లు ప్ర‌పంచంలో అంద‌రికి చెందిన‌వి, కావున వేదాల‌ను అధ్యాయ‌ణం చేసి స‌మాజానికి అందించే వేద శాస్త్ర పండితులు పెర‌గాల‌న్నారు.    

అనంత‌రం న్యూఢిల్లీకి చెందిన జాతీయ సాంస్కృత అకాడ‌మి కార్య‌ద‌ర్శి ఆచార్య‌ ధ‌ర్మేంద్ర కుమార్ శాస్త్రీ  వేదాల్లోని ధ‌ర్మ‌లు – నేటి స‌మాజం  అనే అంశంపై ఉప‌న్య‌సించారు. అంత‌కుముందు వేద విద్యార్థులు చ‌తుర్వేద పారాయ‌ణం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ వేద వ‌ర్సిటీ విసి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.