DHANAPRADA SRI MAHA VISHNU YAGAM HELD TO REGAIN LOST PROSPERITY – TTD EO _ కోల్పోయిన సంపద తిరిగి పొందడానికే యాగం – ప్రపంచం ఆర్థిక కష్టాలు తొలగాలని ప్రార్థించాము – టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి

Tirupati, 15 Dec. 20: To overcome the financial plight caused to the entire humanity across the globe due to COVID 19 Pandemic, Dhanaprada Sri Maha Vishnu Yagam was held in the Yagashala of SV Vedic Varsity on Tuesday, said TTD EO Dr KS Jawahar Reddy.

The EO participated in the special Yagam along with Additional EO Sri AV Dharma Reddy. After the Yagam, the EO said, due to Covid impact, even Tirumala temple remained closed for nearly three months and faced financial issues on par with state and the country in its capacity. “To overcome this financial crisis, existing at present in TTD, state and across the nation, we observed Dhanaprada Sri Maha Vishnu Yagam”, he added.

SIGNIFICANCE:

Explaining its significance, SV Vedic Varsity VC Sri Sannidhanam Sudarshana Sharma said, the mention this Yagam exists in Narada Puranam where Snatana Maharshi narrates the importance of Dhanaprada Yagam to Sage Narada.

Another unique feature is, usually Bilva leaves are considered auspicious for the worship of Lord Shiva while Tulasi for Maha Vishnu. But, interestingly, it is only during this holy month of Dhanur Masam, Lord Sri Maha Vishnu is offered worship with both Bilva and Tulasi leaves along with lotuses. By doing this Yagam, Goddess Lakshmi who resides on the chest of Sri Maha Vishnu gets pleased and blesses the devotees with prosperity and lost riches will be regained.

YAGAM PERFORMED

The deities of Swamy varu along with Sridevi and Bhudevi were seated and offered Tulasi Bilwa Kamala dalarchanam amidst chanting of Vedic hymns. Then Yagam was performed. Sri Venkateswara Dasa Nama Stotram and Sri Venkateswara Mahishi Mahalakshmi Stotram were recited.

It may be mentioned here that TTD has been organising many spiritual programmes ever since Corona lockdown including Yoga Vasisthya Parayanam, Dhanwantari Maha Mantra Parayanam, Sundarakanda Parayanam, Bhagavat Gita, Virata Parvam and many more. From November 16 till December 14, Karthika Masa Deeksha and Homa Mahotsavams were also observed. 

On the first day of Sukla Paksha Padhyami tithi in Dhanur Masam on Tuesday, Dhanaprada Sri Maha Vishnu Yagam was performed with utmost devotion by Rutwiks.

FACAO Sri Balaji, CAO Sri Seshasailendra, DEO Sri Ramanaprasad, CEO SVBC Sri Suresh Kumar, Vedic Scholar Sri Pavana Kumara Sharma, faculty and students of Vedic University and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కోల్పోయిన సంపద తిరిగి పొందడానికే యాగం
– ప్రపంచం ఆర్థిక కష్టాలు తొలగాలని ప్రార్థించాము
– టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి. 15 డిసెంబరు 2020: లోక సంక్షేమం, ప్రపంచం ఆర్థికంగా తిరిగి కోలుకోవడం. కోసం ధనప్రద శ్రీ మహావిష్ణు యాగం నిర్వహించామని టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం యాగశాల లో మంగళవారం నిర్వహించిన ధనప్రద శ్రీ మహావిష్ణు యాగంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం డాక్టర్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోవిడ్ 19 ప్రభావం వల్ల ప్రపంచంతో పాటు టీటీడీకి కూడా సాధారణంగా రావాల్సిన ఆదాయం తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో యాగం చేయడం ద్వారా ప్రపంచ ప్రజలతో పాటు టీటీడీ కూడా ఇంతవరకు కోల్పోయిన ఆదాయం తిరిగి పొంది, ఇబ్బందులన్నీ అధిగమించి, అందరూ ఆరోగ్యం గా ఉండాలని శ్రీ వారిని, శ్రీ మహాలక్షిని ప్రార్థించామన్నారు.

యాగం తో శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు

ధన ప్రద యాగం చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి దేవి అందరినీ ఆశీర్వదించి కోల్పోయి సంపద తిరిగి ప్రసాదిస్తారని వేద విశ్వవిద్యాలయం వి.సి.ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ వివరించారు. నారద పురాణంలో ఈ యాగం ప్రాముఖ్యత గురించి స్పష్టం గా పేర్కొన్నారని ఆయన తెలిపారు. సాధారణంగా పరమ శివుడి పూజకు బిల్వాలు, మహావిష్ణువు పూజకు తులసీ ఆకులు ఉపయోగిస్తారని అన్నారు. కానీ పవిత్ర మైన ధనుర్మాసం లో మాత్రం శ్రీ మహా విష్ణువును బిల్వం, తులసి, కమలం తో పూజిస్తారని ఆయన చెప్పారు.

వేద మంత్తోచ్చారణ మధ్య యాగం 

స్వామి వారిని తన దేవేరులైన శ్రీదేవి,భూదేవి తో పాటు యాగశాలలో వేంచేపు చేశారు. శ్రీ వేంకటేశ్వర దశ నామ స్తోత్రం, మహాలక్షి స్తోత్రం తో పాటు వేద మంత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చిస్తూ యాగం నిర్వహించారు.

అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, ఎఫ్ ఏ సి ఏవో శ్రీ బాలాజి, సి ఏవో శ్రీ శేషశైలేంద్ర, డిప్యూటి ఈఓ శ్రీ రమణ ప్రసాద్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ తో పాటు వర్సిటీ ఆచార్యులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది