DHANUR MASA LAKSHMI DEEPARADHANA AT KURNOOL ON JANUARY 8 _ జ‌న‌వ‌రి 8న క‌ర్నూలులో ధ‌నుర్మాస లక్ష్మీదీపారాధ‌న‌

Tirupati, 5 Jan. 21: As part of Dhanur masa festivities, the TTD is all set to organise Lakshmi Deeparadhana at APSP grounds in Kurnool town on January 8 and will be telecast live by the SVBC.

A series of religious events will be observed which includes Veda Swasti, Kanakadhara Stotram, Mahalakshmi Anugraha Awasyakata, Deepa Prashasti, Sri Mahalakshmi Puja and Deepa Prajwalana.

After the anugraha bhashanam by Pontiff of Mantralaya Mutt Sri Subudendra Theertha, chanting of Sri Alavelu Manga Namavali, Asta Lakshmi Dance ballad and Govinda Namavali Parayanam were also being scheduled.

It may be recalled that to relieve the humanity from Pandemic Covid-19 TTD had organised similar spiritual events – Karthika Masa Deepotsavam at Tirupati on November 30 and Karthika Sahasra Deepotsavam at Visakhapatnam on December 11.

Atharva Rahasyam   Chapter of Agama Shastra Kapinjala Samhita contends that such community Deeparadhana during Dhanur Masam promotes Global health and prosperity.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

జ‌న‌వ‌రి 8న క‌ర్నూలులో ధ‌నుర్మాస లక్ష్మీదీపారాధ‌న‌

తిరుప‌తి‌, 2021 జ‌న‌వ‌రి 05: టిటిడి త‌ల‌పెట్టిన ధ‌నుర్మాస ఉత్స‌వాల్లో భాగంగా జ‌న‌వ‌రి 8న క‌ర్నూలు న‌గ‌రంలోని ఎపిఎస్‌పి మైదానంలో ధ‌నుర్మాస లక్ష్మీదీపారాధ‌న కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌రకు జ‌రుగనున్న ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఇందులో భాగంగా వేదస్వ‌స్తి, క‌న‌క‌ధారాస్తోత్రం, మ‌హాల‌క్ష్మీ అనుగ్ర‌హ ఆవ‌శ్య‌క‌త‌, దీప ప్ర‌శ‌స్తి, శ్రీ‌మ‌హాల‌క్ష్మీపూజ‌, దీప ప్ర‌జ్వ‌ల‌న త‌రువాత శ్రీ‌శ్రీ‌శ్రీ మంత్రాల‌యం పీఠాధిప‌తి అనుగ్ర‌హ భాష‌ణం చేస్తారు. ఆ త‌రువాత శ్రీ అల‌మేల్మంగ నామావ‌ళి, అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం నృత్య రూప‌కం, గోవింద‌నామాల పారాయ‌ణం ఉంటుంది.

కాగా, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేయాని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ నవంబరు 30వ తేదీన తిరుపతిలో కార్తీక మహా దీపోత్సవం, డిసెంబరు 11న విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం నిర్వహించిన విష‌యం తెలిసిందే.

ధ‌నుర్మాసంలో సామూహిక దీపారాధ‌న వ‌ల్ల ప్ర‌పంచ మాన‌వాళికి ఆరోగ్యం చేకూరుతుంద‌ని ఆగ‌మ గ్రంథ‌మైన క‌పింజ‌ల సంహిత‌లోని అథర్వ ర‌హ‌స్యం అనే విభాగంలో పేర్కొన‌బ‌డింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.