DHARNURMASAM AND V DAY EVENTS IN TTD SUB TEMPLES_ టిటిడి అనుబంధ ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు

Tirupati, 15 Dec. 18: As part of Dhanurmasam celebrations special programs including Vishesha pujas will be observed in all sub temples of TTD from Sunday onwards.

AT SRI PAT

Special rituals will be held at the Sri Padmavati Ammavari Temple as Dhanur masam begins at 5.30pm on Sunday evening. Goddess Padmavati will be paraded in the mada streets on Vaikunta Ekadasi day on December 17 from 10.30am till 11.30am. On Vaikunta Dwadasi day, chakrasnanam will be performed for Sri Chakrathalwar .

AT SRI GOVINDARAJA SWAMY TEMPLE

Dhanur masam pujas will be held from 4pm-7pm on December 16. Tirupalliyzuchi parayanam will be recited every day during the holy month. On both the baik intha ekadasi and dwadasi days the utsava idols of Swamy and Ammavaru will be taken on a celestial procession in mada streets.

AT SRI KVS TEMPLE

The special rituals will commence from 4.30-5.30 evening of December 16 in Srinivasa Mangapuram. On both auspicious days Vaikunta Dwara darshan is organised to the devotees.

AT APPALAYAGUNTA TEMPLE

The special rituals will commence from 4pm-7pm of December 16 and Tirupalliyazutchi parayanam will be held daily during the holy month. Visesha pujas are scheduled for Vaikuntha Ekadasi, Dwadasi and New year day on January 2019.

Similar special rituals, parayanam and processions are scheduled during holy month of Dhanurmasa at Sri ChennaKeshava temple, and Sri Siddeswara Temple in Tallapaka, Sri Lakshmi Venkateswara temple of Devunikadapa,
Sri Viranjaneya temple at Gandi, Sri Narapura Venkateswara temple at Jammalamadugu in Kadapa district.

Special cultural programs will also be held on all these days by the artists of the HD PP and Annamacharya project

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి అనుబంధ ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు

తిరుపతి, 2018 డిసెంబరు 15: టిటిడి అనుబంధ ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16వ తేదీ నుండి 2019, జనవరి 14వ తేదీ వరకు విశేష కార్యక్రమాలు జరుగనున్నాయి. డిసెంబరు 16న ఆదివారం సాయంత్రం 5.19 గంటలకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 5.00 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాసం కైకర్యం నిర్వహిస్తారు. డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఊరేగనున్నారు. డిసెంబరు 19న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు పద్మపుష్కరినిలో శ్రీ చక్రతాళ్వారుకు చక్రస్నానం నిర్వహిస్తారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 16న సాయంత్రం 4.00 నుండి 7.00 గంటల వరకు ధనుర్మాస కైంకర్యం నిర్వహిస్తారు. డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 19న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున తిరుపళ్లియళుచ్చి పారాయణం చేస్తారు.

శ్రీ కల్యాణ వేంకటశ్వరస్వామివారి ఆలయంలో…

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాసం కైకర్యం నిర్వహిస్తారు. డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 19న వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం కల్పించనున్నారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 16న సాయంత్రం 4.00 నుండి 7.00 గంటల వరకు ధనుర్మాస కైంకర్యం నిర్వహిస్తారు. డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 19న వైకుంఠ ద్వాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని 2019, జనవరి 1న విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున తిరుప్పావై పారాయణం చేస్తారు.

అదేవిధంగా వైఎస్‌ఆర్‌ జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఆలయం, దేవునికడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయం, గండిలోని శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం, జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16వ తేదీ నుండి 2019, జనవరి 14వ తేదీ వరకు తెల్లవారుజామున తిరుప్పావై పారాయణం చేస్తారు. అదేవిధంగా డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, న, డిసెంబరు 19న వైకుంఠ ద్వాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది 2019, జనవరి 1 ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టిటిడి ఆలయాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.