DHWAJAVAROHANAM HELD _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 

TIRUPATI, 28 MARCH 2023: The annual brahmotsavam in Sri Kodandarama Swamy temple at Tirupati came to a grand conclusion with the religious Dhwajavarohanam on Tuesday evening.

 

The Garuda Patam which was hoisted on the first day of annual fete was lowered as per agamas.

 

Deputy EO Smt Nagaratna, AEO Sri Mohan and others were present.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు
 
తిరుపతి, 2023 మార్చి 28: తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
 
రాత్రి 8.30 గంటలకు  ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.
 
బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం . విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం . 
 
ఈ కార్యక్రమంలో  డిప్యూటీ ఈవో శ్రీ నాగరత్న, ఏఈఓ శ్రీ మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.