ALL SET FOR RADHA SAPTHAMI ON FEB 12_ డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

Tirumala, 1 Feb. 19: TTD is gearing up for the yet another big festival Radhasapthami which is scheduled on February 12, said TTD EO Sri Anil Kumar Singhal.

Speaking to media persons in Annamaiah Bhavan on Friday the EO said, Sri Malayappa Swamy will take celestial ride on seven different vahanams on the auspicious day.

Later the EO said, on February 5 and 19 TTD will issue 4000 tokens to senior citizens and physically challenged persons while on February 6 and 20 to parents with children below 5years of age.

Both the events of Maha Kumbhabhishekam for the temple at Kanya kumari and Bhookarshana for the temple at Amaravathi went off in a successful manner, he informed.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti, CE Sri Chandrasekhar Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

తిరుమల, 01 ఫిబ్రవరి 2019: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అమరావతిలో శ్రీవారి ఆలయం :

అమరావతిలో రూ.150 కోట్లతో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి జనవరి 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ||శ్రీనారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఆగమోక్తంగా భూకర్షణం నిర్వహించాం. శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయం నిర్మాణానికి సిఆర్‌డిఏ 25 ఎకరాల స్థలం ఉచితంగా కెేటాయించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పవిత్ర కార్యక్రమానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి విచ్చేసిన వేలాది మంది శ్రీవారి సేవకులు, భజన మండలి సభ్యులు, స్థానికులు, టిటిడి సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 10వ తేదీన ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుంది. 6 ఎకరాలలో శ్రీవారి ఆలయం, ఏడాదంతా ధార్మిక కార్యక్రమాలు జరిగేలా మిగిలిన 19 ఎకరాలలో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాం.

కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం:

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో రూ.22.50 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 27వ తేదీన విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించాం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుటున్నారు.

హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయం :

హైదరాబాద్‌లో రూ.28 కోట్లతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయంలో మార్చి 13న విగ్రహప్రతిష్ఠ జరుగనుంది.

ఫిబ్రవరి 12న రథసప్తమి :

– ఫిబ్రవరి 12న సూర్యజయంతిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో రథసప్తమి

ఉదయం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు వైభవంగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా ఒకేరోజు 7 ప్రధాన వాహనాలపై శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. దీనిని ఒకరోజు బ్రహ్మూెత్సవంగా వ్యవహరిస్తారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ప్రణాళికాబద్ధంగా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రత్యేక దర్శనాలు :

ఫిబ్రవరి 5, 19వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తాం. ఫిబ్రవరి 6,20వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.

భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని 10 అతిథి భవనాలలో చాపలు, దిండ్లు, రగ్గులు మరియు దుప్పట్లు అదనంగా అందిస్తున్నాం.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తాం.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తాం.

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయం :

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి విశేషమైన ప్రాశస్త్యముంది. శ్రీ కపిలముని తపస్సుకు మెచ్చి పరమశివుడు లింగ రూపంలో స్వయంభువుగా అవతరించారు. ఈ కారణంగా ఇక్కడి స్వామివారికి శ్రీ కపిలేశ్వరస్వామి అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని రోజుకు దాదాపు 3 వేల నుండి 4 వేల మంది, సోమవారంనాడు 5 వేల నుండి 6 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నెలకు సుమారు రూ.8 లక్షల హుండీ ఆదాయం లభిస్తోంది. ఆర్జిత సేవల నిర్వహణ ద్వారా నెలకు సుమారు రూ.6 లక్షలు లభిస్తోంది.

ఆలయంలో బ్రహ్మూెత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు, కార్తీక సోమవారాలు,కార్తీక దీపోత్సవం, విశేష హోమాలు, అన్నాభిషేకం తదితర ప్రత్యేక రోజుల్లో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నాం.

అభివృద్ధి పనులు :

గతంలో రూ.80 లక్షలతో స్వామివారి దర్శనానంతరం భక్తులు వెలుపలికి వచ్చేందుకు వీలుగా క్యూలైన్‌ బ్రిడ్జి, పుష్కరిణి నుండి వచ్చే నీరు వాగులోనికి ప్రవహించేందుకు కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌, జలపాతం వద్ద భక్తులు జారకుండా ఉండేందుకు కట్‌స్టోన్‌ ఫ్లోరింగ్‌, ఆర్జితసేవా టికెట్‌ కౌంటర్‌ నిర్మించాం.

ఈ ఏడాది రూ.60 లక్షలతో కల్యాణకట్ట, కార్యాలయ భవనం, పాదరక్షల కౌంటర్‌ నిర్మించేందుకు చర్యలు చేపట్టాం.అదేవిధంగా మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఆలయ గోపురం, మండపాల పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం.

దర్శనం :

– గతేడాది జనవరిలో 20.43 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది జనవరిలో 21.3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది జనవరిలో రూ.81.88 కోట్లు కాగా, ఈ ఏడాది జనవరిలో రూ.86.12 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది జనవరిలో 49.08 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది జనవరిలో 43.86 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూ లు :

– గతేడాది జనవరిలో 83.49 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది జనవరిలో 94.47 లక్షల లడ్డూలను అందించాం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.