MORE ROOMS COMING UP AT ALIPIRI TO RESOLVE ACCOMMODATION PROBLEMS TO PILGRIMS IN FUTURE-TTD EO_ ఆన్‌లైన్‌లో 70,786 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :’డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

TIRUMALA, 1 Feb. 19: To resolve the accommodation problems to pilgrims who are coming to Tirumala, the TTD board has approved to construct 2000 rooms at Alipiri, the gate way to Tirumala in future, said TTD EO Sri Anil Kumar Singhal.

The monthly Dial Your EO programme took place at Annamaiah Bhavan in Tirumala on Friday. EO attended to the calls of 17 callers from across different states during the programme. Answering a pilgrim caller Smt Punyavathi from West Godavari district of Andhra Pradesh, who sought EO to consider one hour grace time for the booked rooms in Tirumala if the pilgrim arrives late, to which the EO said, the entire mechanism of accommodation is computerised and the system will automatically allot the accommodation to another pilgrim if the advanced booking pilgrim does not turn up on time. That too in Tirumala, we have in sufficient accommodation. To overcome this problem, the board has recently approved to construct a huge amenities complex for the pilgrim in Alipiri. In the first phase 500 rooms will be constructed”, he added.

While caller Smt Parvathi from Vijayawada brought to the notice of EO that the Srivari Sevakulu are degraded by some department staffs while on service duty which is hurting the volunteers to which the EO said, the Srivari Seva volunteers are rendering huge services to pilgrims. Even the Honourable CM of AP Sri N Chandra Babu Naidu complimented the impeccable services of Srivari Sevakulu during Bhookarshana puja held at Amaravathi on January 31. “So there is no need to feel hurt just because of the different approach of a few staff. However we instruct them to behave properly with volunteers”, he said.

Another caller Sri Venkateswara Rao from Eluru informed EO that saffron (Kumkuma Puvvu) is not utilized in prasadams which used to be in olden days.The EO said, the management will not interfere in religious issues however this will be discussed with the religious staff.

Caller Sri Yatindra from Machilipatnam said that he got a Suprabhatam ticket in lucky dip but did not get any SMS or mail from TTD and he lost the ticket. EO said, if the problem is a Technical issue we will definitely rectify it.

A caller from Rajamundry Sri Nageswara Rao said, that in SVBC Nityapujalivigo programme, the pooja to deities is being rendered by splitting every petal of the flower while renowned Religious Scholar Sri Chaganti Koteswara Rao in his discourse negates splitting of petals and offering to Lord to which the EO said, they will discuss the issue with religious scholars.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఆన్‌లైన్‌లో 70,786 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :’డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమల, 01 ఫిబ్రవరి 2019: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన మే నెల కోటాలో మొత్తం 70,786 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 11,486 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 8,091, తోమాల 140, అర్చన 140, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 59,300 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2000, కల్యాణం 14,725, ఊంజల్‌సేవ 4,650, ఆర్జితబ్రహ్మూెత్సవం 7,425, వసంతోత్సవం 14,300, సహస్రదీపాలంకారసేవ 16,200 టికెట్లు ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. హనుమంతరావు – రామదుర్గం, కర్నాటక.

ప్రశ్న: వైకుంఠఏకాదశి తదితర ప్రత్యేకపర్వదినాలలో శ్రీవారిసేవకులకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు?

ఈవో : టిటిడిలో రోజుకు సాధారణ రోజులలో 1500లకు పైగా, పర్వదినాలలో రోజుకు 3 వేలకు పైగా శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారు. పద్దతి ప్రకారం ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నాం.

2. నాగేశ్వరరావు – రాజమండ్రి

ప్రశ్న: శ్రీవారికి ఉపయోగించే పుష్పాలను తుంచి వేయరాదని ఎస్వీబీసీ ప్రసారాలలో శ్రీచాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తున్నారు. అయితే ఎస్వీబీసీలో ప్రసారమయ్యే నిత్యపూజలివిగో కార్యక్రమంలో పుష్పాల రెమ్మలను తుంచి వేస్తున్నారు. శ్రీపద్మావతి అమ్మవారి కల్యాణం సందర్భంగా అర్చకులు సంప్రదాయంగా గోచి కట్టకుండా పంచెలు కట్టుకుని వస్తున్నారు?

ఈవో : టిటిడిలో కార్యక్రమాలన్నీ ఆగమశాస్త్ర ప్రకారమే జరుగుతాయి. ఈ విషయంపై అర్చకులతో సంప్రదిస్తాం.

3. నందగోపాల్‌ – చెన్నై

ప్రశ్న: జనవరి 27వ తేదిన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం, జనవరి 31వ తేదిన అమరాతిలో నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమాలను చాలా బాగా నిర్వహించారు. ?

ఈవో : కృతజ్ఞతలు.

4. వేంకటేశ్వరరావు – ఏలూరు

ప్రశ్న: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గతంలో కుంకుమ్మపువ్వును ఉపయోగించేవారు, ప్రస్తుతం వాడడం లేదు. దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులకు కరపత్రాలు అందించండి?

ఈవో : ప్రస్తుతం టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఇచ్చిన సలహాలు, సూచనలు పరిశీలిస్తాం.

5. పుణ్యవతి – పశ్చిమగోదావరి

ప్రశ్న: జనవరి 29వ తేదిన ఆన్‌లైన్‌లో తిరుమల గదులు బుక్‌ చేసుకుని వచ్చాం. కేవలం 4 నిమిషాలు ఆలస్యం కావడంతో గదులు కేటాయించలేదు?

ఈవో : తిరుమలలో గదులు పరిమితంగా ఉన్నాయి. భక్తులు రోజుకు 60 వేల నుండి 80పైచిలుకు వస్తున్నారు. కావున విధానపరంగా గదులు కేటాయిస్తున్నాం.

6. పార్వతి – విజయవాడ

ప్రశ్న: తిరుమలలో శ్రీవారి సేవకులను సిబ్బంది చులకనగా మాట్లాడుతున్నారు. ?

ఈవో : శ్రీవారి సేవకుల సేవలను రాష్ట్రముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబునాయుడు అభినందించారు. టిటిడిలోని అన్ని విభాగాలలో వీరు అద్భుతమైన సేవలందిస్తున్నారు. త్వరలో వారికోసం నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఒకరిద్దరి మాటలను శ్రీవారి సేవకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

7. గాయత్రి, సావిత్రి, గోవిందరాజు – బెంగుళూరు, కళావతి – ఖమ్మం

ప్రశ్న: ఏడాదిలోపు పిల్లల తల్లిదండ్రులలో తండ్రి దర్శనానికి రాలేని పక్షంలో మరొకరిని అనుమతించిండి, గుండె ఆపరేషన్‌ చేసుకున్న వారికి ప్రత్యేక దర్శనం కల్పించండి, 80 సంవత్సరాలు పైబడిన వారికి ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు కల్పించండి?

ఈవో : టిటిడిలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు పద్దతి ప్రకారం దర్శనం కల్పిస్తున్నాం. వృద్ధులు, దివ్యాంగులకు తోపులాటలు జరగకుండా రోజుకు 1400 మందికి వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. నెలలో 2 సాధారణ రోజుల్లో 4 వేల టోకెన్లు అదనంగా జారీ చేస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోండి.

8. యతీంద్ర – మచిలీపట్నం, నరసింగారావు – విశాఖపట్నం

ప్రశ్న: లక్కీడీప్‌లో సుప్రభాత సేవ వచ్చింది. అయితే నాకు సమాచారం లేకపోవడం వల్ల డబ్బులు చెల్లించలేదు. మరోసారి అవకాశం కల్పిస్తారా, లక్కీడీప్‌లో సేవా టికెట్లు పొందినవారు అనివార్యకారణాల వల్ల రాలేనిపక్షంలో మరొకరికి అవకాశం కల్పించండి?

ఈవో : సేవా టికెట్లను పారదర్శకంగా భక్తులకు కేటాయిస్తున్నాం. ఇతరులకు బదలాయించడం సాధ్యంకాదు.

9. నాగేశ్వరరావు – నర్సాపురం

ప్రశ్న: ఆన్‌లైన్‌లో టిటిడి కల్యాణమండపం బుక్‌ చేసుకున్నాం. అనివార్యకారణాల వల్ల మరోతేదికి మార్చుకోవచ్చా, రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లిస్తారా?

ఈవో : సకాలంలో రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కల్యాణమండపం ఖాళీగా ఉండే కేటాయిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.