DIWALI ASTHANAM AT SRIVARI TEMPLE ON OCTOBER 31 _ అక్టోబరు 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Tirumala, 20 October 2024: On the auspicious day of Deepavali,  Asthanam will be held in Tirumala temple on October 31.

The religious ritual takes place in the Ghanta Mandapam inside Bangaru Vakili from 7 am to 9 am.

As part of the Asthanam, Sri Malayappa Swamy along with the Sridevi and Bhudevi will be offered prayers on the Sarvabhoopala Vahanam facing the Garudalwar.  

Sri Vishvaksena, the commander-in-chief, is also enshrined on another pedestal to the left of the Sri Malayappa facing South.

After that, special puja, harati and prasadams are offered to the deities by the priests with which Deepavali Asthanam concludes.

At 5pm, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi will participate in Sahasra Deepalankarana Seva and walk around the four mada streets majestically to bless the devotees.

TTD has cancelled the Tiruppavada, Kalyanotsavam, Unjal Seva and Arjitha Brahmotsavam on October 31 due to Deepavali Asthanam.   

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుప‌తి, 2024 అక్టోబరు 20: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన‌ ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది.

దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

కాగా సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా అక్టోబరు 31న తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.