DO NOT GIVE ANY GIFTS DURING UMBRELLA PROCESSION -TTD _ గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండి : టీటీడీ
Tirumala, 05 October 2024: TTD has appealed that devotees should not offer any gifts during the umbrella procession that reaches Tirumala from Chennai to be decorated during Garuda Vahana Seva on October 8 as part of Srivari Salakatla Brahmotsavam.
TTD reiterated that the gifts given by devotees do not reach TTD and the institution has nothing to do with the gifts.
During the Srivari annual Brahmotsavam, many Hindu organizations donate umbrellas from Chennai in a procession to Tirumala and present them to Srivaru.
These umbrellas brought in a procession are expected to reach Tirumala on October 7.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండి : టీటీడీ
తిరుమల, 2024 అక్టోబరు 05: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.