DOCTORS ARE MIRROR IMAGES OF ALMIGHTY- TTD EO _ డాక్టర్లు భగవత్ స్వరూపులు- టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

DOCTORS SHOULD LOVE THEIR PATIENTS

Tirupati,19 August 2023: TTD EO Sri AV Dharma Reddy on Saturday advised SVIMS doctors to function with dedication, be friendly with patients and treat them with love.

Participating as chief guest at a doctors conference organised by SVIMS Director and TTD JEO(Health and Education) Smt Sada Bhargavi, the TTD EO said patients have immense faith in doctors whom they consider next to God.

He urged the doctors to arrive for the overall development of the SVIMS organisation and serve patients on par with  BIRRD and SPCHC hospitals of TTD and ensure that Tirupati become a medical hub in the country.

He said doctors of SVIMS are experts in their specialties and TTD has installed the latest medical equipment and operating theatres. For enhanced medical knowledge from Vedas, they could coordinate efforts with scholars of SV Veda University.

The EO said SVIMS has been developed on expert advice of the visiting doctors from all over the country to address ailments and advised them to hold interactions every fortnight and have monthly sessions with  SVIMS Director to resolve issues of any.

Earlier the TTD EO also received suggestions for the development of SVIMS from doctors. SVIMS Director Smt Sada Bhargavi presented the progress card on three months of activities at SVIMS.

TTD FA & CAO Sri Balaji also made a presentation on TTDs investment in SVIMS.

SVIMS Medical Superintendent Dr Ram, CE Nageswara Rao, Additional  FA & CAO Sri Ravi Prasadu and other officials and doctors were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డాక్టర్లు భగవత్ స్వరూపులు

– రోగులకు ప్రేమతో సేవలందించండి

– టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

తిరుప‌తి, 2023 ఆగ‌స్టు 19: స్విమ్స్‌కు వచ్చే రోగులకు డాక్టర్లు ప్రేమతో, నిబద్ధతతో సేవలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి అన్నారు. స్విమ్స్ డైరెక్టర్ శ్రీమతి సదా భార్గవి ఐఏఎస్ ఏర్పాటు చేసిన డాక్టర్లతో సమావేశానికి ఈవో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రోగులు భగవంతుని తరువాత డాక్టర్లను భగవత్ స్వరూపులుగా భావిస్తారన్నారు. డాక్టర్లపై నమ్మకం ఉంచి వారిచ్చే చికిత్సను నియమానుసారం కొనసాగిస్తారని చెప్పారు. అంతటి గొప్ప స్థితిలో ఉన్న డాక్టర్లు రోగులకు చక్కగా సేవలు అందించాలని, స్విమ్స్ అభివృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు.

తిరుపతిని ఒక మెడికల్ హబ్‌గా తీర్చి దిద్దేందుకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. బ‌ర్డ్‌, ఆయుర్వేద, చిన్న పిల్లల ఆసుపత్రుల పనితీరు మెరుగుపడిందని, అదే స్థాయిలో స్విమ్స్ ఆసుపత్రి మ‌రింత‌ మెరుగ్గా పనిచేసేందుకు డాక్ట‌ర్లు ప్రణాళిక బద్ధంగా పనిచేయాల్సి ఉందన్నారు. స్విమ్స్‌లోని డాక్టర్లు ఎంతో నైపుణ్యం కలిగి ఉన్నారని, విభాగాల వారీగా వారికి అవసరమైన సిబ్బంది, అత్యాధునిక వైద్య‌ పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్లు టీటీడీ అందిస్తుందని తెలిపారు.

డాక్టర్లు మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా వేదాలలో దాగివున్న మెడికల్ సైన్స్ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఇందుకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితుల సహకారం తీసుకోవాలని సూచించారు. గత సమావేశంలో వివిధ విభాగాల‌కు చెందిన డాక్టర్లు ఇచ్చిన అభిప్రాయాల‌ ఆధారంగా చేసుకుని, సమస్యలను 90% పరిష్కారం చేశామన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు అంతర్గత సమావేశాలు నిర్వహించాలని, డైరెక్టర్ నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. స్విమ్స్‌ అభివృద్ధికి టీటీడీ వందలాది కోట్లు ఖర్చు చేస్తున్నద‌న్నారు. అదేవిధంగా ఈ ఆసుప‌త్రికి వ‌చ్చే రోగుల‌ను త‌మ పిల్ల‌లుగా భావించి వారికి మెరుగైన వైద్యాన్ని అందించడం ద్వారా సిమ్స్ అభివృద్ధికి బాటలు వేయాలని ఈవో డాక్టర్లను కోరారు. ఈ సంద‌ర్బంగా స్విమ్స్ ఆసుప‌త్రి అభివృద్ధికై డాక్ట‌ర్లు ఈవోకు ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించారు.

అంతకుముందు స్విమ్స్‌ డైరెక్టర్ శ్రీమతి సదా భార్గవి గత మూడు నెలల్లో ఆసుప‌త్రిలో జరిగిన ప్రగతిని వివరించారు.

టీటీడీ ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ స్విమ్స్ అభివృద్ధికి టీటీడీ ఖ‌ర్చు చేస్తున్న‌ నిధుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిటి) ద్వారా తెలిపారు.

సిమ్స్ మెడికల్ సూపరిండెంట్‌ డాక్టర్ రామ్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, అదనపు ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ ర‌విప్ర‌సాదు, ఇతర అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.