SILVER ORNAMENTS GIFTED TO TTD LOCAL TEMPLES_ టిటిడి స్థానిక ఆల‌యాల‌కు వెండి అభరణాలు బహుకరణ

Tirupati, 17 Aug. 19: The Bajaj motor dealers of Tirupati Sri R Srinivasulu, and Sri R Saket Ram have donated 5417 kgs of silver ornaments to TTD local temples of Sri Kalyana Venkateswara temple at Srinivasa Mangapuram, and Sri Venugopal temple of Karvetinagaram.

They handed over the ornaments to TTDs JEO Of Tirupati Sri P Basanth Kumar at his chambers in TTD administrative building on Saturday morning.

TTD local temples DyEO Sri Yalappa, Smt VR Shanti, AEO Sri Thirumalaiah, Superintendent Sri Ramesh, temple inspector Sri Anil, Sri Suryanarayana and others participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి స్థానిక ఆల‌యాల‌కు వెండి అభరణాలు బహుకరణ

తిరుపతి, 2019 ఆగ‌స్టు 17: టిటిడి అనుబంధ ఆలయాలైన శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి , కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాలస్వామివారికి తిరుప‌తికి చెందిన బ‌జాజ్ మోట‌ర్స్ డీల‌ర్లు శ్రీ ఆర్‌. శ్రీ‌నివాసులు, శ్రీ ఆర్‌.సాకేత్ రామ్‌లు 5.417 కేజిల వెండి అభరణాలను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌కు బహుకరించారు. తిరుప‌తి టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో శ‌నివారం ఉద‌యం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఇందులో శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి 4.247 కేజిల వెండి బిందే, కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాలస్వామివారికి 1.17 కేజిల వెండి శంఖుధార‌, చ‌క్ర‌ధార‌ల‌ను అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్రీ య‌ల‌ప్ప‌, శ్రీ‌మ‌తి వి.ఆర్‌.శాంతి, ఏఈవో శ్రీ తిరుమ‌ల‌య్య‌, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ అనిల్‌, శ్రీ సూర్య‌నారాయ‌ణ‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.