DONATION OF ORGANIC RICE AND VEGETABLES TO TTD _ శ్రీ‌వారికి ప్ర‌కృతి వ్య‌వ‌సాయం బియ్యం, కూర‌గాయలు విరాళం

Tirumala, 29 Apr. 21: A devotee from Krishna District Sri Vijayaram hailing from Pinagudurlanka has donated Rice and vegetables grown in organic farming with Cow based farming inputs were donated to TTD on Thursday morning.

TTD additional EO Sri AV Dharma Reddy who received the goods symbolically in front of Srivari temple said the farmer had donated 2200 kgs of organic rice, vegetables, bananas and jaggery besides 15 kgs of desi cow ghee adequate for 10 days of Srivari naivedyam.

He said the farmer had approached TTD chairman and TTD EO expressing his intentions for the donation of organic farm products and from Friday tomorrow, the TTD will produce Anna Prasadams from these products.

The Additional EO said if the required quantity of these organic products were available with the farmers, TTD was ready to buy them directly for use in 

Anna Prasadam for naivedyam and also distribution among devotees as the fertiliser and pesticides free products were healthy for all.

The farmer Sri Vijayaram urged TTD to prepare Srivari naivedyam on all 365 days from organically farmed rice henceforth in the best interests of devotee’s health and also the reputation of Srivari temple.

TTD board member Sri Shivkumar, Temple DyEO Sri Harindranath, DyEO Sri Vijaysaradhi, Health officer Dr RR Reddy and Catering officer Sri GLN Shastri were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారికి ప్ర‌కృతి వ్య‌వ‌సాయం బియ్యం, కూర‌గాయలు విరాళం

ఏప్రిల్ 29, తిరుమల 2021: గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో దేశీయ వ‌రి వంగ‌డాల‌తో పండించిన బియ్యం, కూర‌గాయ‌లు గురువారం తిరుమ‌ల శ్రీ‌వారికి విరాళంగా అందాయి. కృష్ణా జిల్లా పిన‌గూడురులంకకు చెందిన రైతు శ్రీ విజ‌య‌రామ్ ఈ మేర‌కు బియ్యం, కూర‌గాయ‌ల‌ను శ్రీ‌వారి ఆల‌యం ఎదుట టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో దేశీయ వ‌రి వంగ‌డాల‌తో పండించిన బియ్యంతో శ్రీ‌వారికి నైవేద్యం స‌మ‌ర్పించాల‌ని రైతు శ్రీ విజ‌య‌రామ్ టిటిడి ఛైర్మ‌న్‌, ఈవోను సంప్ర‌దించార‌ని చెప్పారు. ఈ మేర‌కు మొద‌ట‌గా 10 రోజుల పాటు స్వామివారికి నైవేద్యం పెట్టే అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి గాను 2200 కిలోల బియ్యం, కూర‌గాయ‌లు, అర‌టిపండ్లు, బెల్లం, 15 కిలోల దేశీయ ఆవు నెయ్యి అందించార‌ని తెలిపారు. ఈ బియ్యంలో ప్రొటీన్లు, ఫైబ‌ర్, విట‌మిన్లు పుష్క‌లంగా ఉన్నాయ‌న్నారు. శుక్ర‌వారం నుంచి ఈ బియ్యంతో త‌యారుచేసిన అన్న‌ప్ర‌సాదాల‌ను స్వామివారికి నైవేద్యంగా స‌మ‌ర్పిస్తామ‌ని చెప్పారు. ఈ బియ్యం కావాల్సిన మోతాదులో దొరికితే రైతుల నుండే నేరుగా సేక‌రించి స్వామివారికి నైవేద్యంతోపాటు భ‌క్తుల‌కు అందించే అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి కూడా వినియోగిస్తామ‌న్నారు. ఎరువులు, పురుగుల మందులు వాడ‌కుండా పండించిన‌ ఇలాంటి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను వాడితే ప్ర‌జలంద‌రూ ఆరోగ్యంగా ఉంటార‌ని తెలిపారు.

రైతు శ్రీ విజ‌య‌రామ్ మాట్లాడుతూ శ్రీ‌వారికి 365 రోజుల పాటు 365 ర‌కాల దేశీయ వ‌రి వంగ‌డాల బియ్యంతో నైవేద్యం స‌మ‌ర్పించే అవ‌కాశం క‌ల్పించాల‌ని టిటిడిని కోరారు. గో ఆధారిత వ్య‌వ‌సాయం ద్వారా భూమి సార‌వంత‌మ‌వుతుంద‌ని, ఇలాంటి ఉత్ప‌త్తుల‌ను స‌మాజంలోని ప్ర‌జలంతా వినియోగించాల‌ని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, డెప్యూటీ ఈవో శ్రీ విజ‌య‌సార‌ధి, ఆరోగ్య‌శాఖ అధికారి డాక్ట‌ర్ ఆర్‌.ఆర్‌.రెడ్డి, క్యాట‌రింగ్ అధికారి శ్రీ శాస్త్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.