DONATION OF PATTU SAREES _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వస్త్రబహుమానం స్వీకరణ

Tiruchanoor, 21 Nov. 19: TTD has invited devotees to donate silk vastrams to be decorated to the presiding deity of Sri Padmavathi Ammavaru at Tiruchanoor in view of annual brahmotsavams which are going to commence from November 23 onwards.

These donations will be accepted in the office of Superintendent in Sri Padmavathi Ammavari temple from 10am to 5pm during these nine days of Brahmotsavams.

The devotees are requested to donate only quality sarees with nine inch border.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వస్త్రబహుమానం స్వీకరణ
 
తిరుప‌తి, 2019 న‌వంబ‌రు 21: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు భక్తుల నుంచి ప‌ట్టువస్త్రాల‌ను బహుమానంగా స్వీకరిస్తారు. భ‌క్తులు స‌మ‌ర్పించే ఈ వ‌స్త్రాల‌ను అమ్మవారి మూలమూర్తికి అలంకరిస్తారు.

భ‌క్తులు ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆల‌యంలోప‌ల సూప‌రింటెండెంట్‌ను క‌లిసి వ‌స్త్రాల‌ను అంద‌జేయ‌వ‌చ్చు. శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తికి అలంకరించేందుకు 9 ఇంచులు, ఆపైన గల జరీ బార్డర్‌ కలిగిన నాణ్యమైన పట్టుచీరలను మాత్రమే స్వీకరిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.