ALL SET FOR PAT BTUs _ న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

Tiruchanoor, 21 Nov. 19: The pilgrim centre of Tiruchanoor is all set ready to celebrate the nine-day annual brahmotsavams from November 23 with Ankurarpanam on November 22.

The annual brahmotsavams of Sri Padmavathi Ammavaru will be observed with celestial grandeur for nine days every year in the auspicious month of Karthika. This year the most important celestial fete commences with Dhwajarohanam in the designated Vrischika Laganam between 

8.30am and 8.50am.  

VAHANA SEVA ADVANCES IN NIGHT

To facilitate pilgrims, TTD has advanced vahana seva in the nights by half an hour. In stead of 8pm the vahanas will commence by 7.30pm and last till 11pm. 

ALL ARRANGEMENTS IN PLACE

Meanwhile all the departments have geared up for the mega religious festival which is considered next most important and challenging fete after Tirumala Srivari annual brahmotsavams.

TTD has made elaborate arrangements under the instructions of TTD EO Sri Anil Kumar Singhal and in the supervision of JEO Sri P Basanth Kumar which included engineering works like barricading, setting up of queue lines, LED screens, Annaprasadam counters, addititonal temporary toilets etc.tomeet the needs of the pilgrim devotees who are expected to throng this religious fete during these nine days especially on the day of Gaja Vahanam, Rathotsavam and Panchami Theertham.

Apart from the regular security and local police, nearly 1000 numbers of Srivari Sevakulu, NCC and Scouts have also been deployed for this big fest.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

అర‌గంట ముందుగా రాత్రి వాహ‌న‌సేవ‌

భ‌క్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు

 తిరుప‌తి, 2019 న‌వంబ‌రు 21: శ్రీ‌వారి ప‌ట్ట‌పుదేవేరి అయిన సిరుల‌త‌ల్లి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. శ‌నివారం ఉదయం 8.30 నుంచి 8.50 గంటల నడుమ వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణం వేడుకగా జరుగనుంది. భ‌క్తుల సౌక‌ర్యార్థం రాత్రి వాహ‌న‌సేవ‌ను అర‌గంట ముందుగా ప్రారంభించి రాత్రి 7.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అద‌నంగా క్యూలైన్లు, అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌, పార్కింగ్ ఏర్పాట్లు చేప‌ట్టారు.

సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. ముందుగా ధ్వ‌జస్తంభానికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేస్తారు. రాగ, స్వర, తాళాలతో దేవతలను, పంచాయుధాలను, కుముదాది గణాలను ఆహ్వానిస్తారు. భూలోకం, సువర్ణ లోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణ చేయడంతో ధ్వజారోహణ పర్వం పూర్తవుతుంది.

విస్తృతంగా ఏర్పాట్లు :

బ్ర‌హ్మోత్స‌వాల కోసం అమ్మ‌వారి ఆల‌యం, మాడ వీధులు, ప‌ద్మ‌పుష్క‌రిణి త‌దిత‌ర ప్రాంతాల్లో క్యూలైన్లు, బారీకేడ్లు, చ‌లువపందిళ్లు, రంగోళీలు ఏర్పాటు చేశారు. తిరుచానూరు, తిరుప‌తిలోని ముఖ్య‌మైన ప్రాంతాల్లో బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానం ప‌లుకుతూ స్వాగ‌త ఆర్చిలు, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేశారు. భ‌క్తుల కోసం తాత్కాలిక ల‌గేజి కౌంట‌ర్లు, సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంట‌ర్లు రూపొందించారు. తిరుప‌తిలోని రామానుజ స‌ర్కిల్ నుండి తిరుచానూరులోని అమ్మ‌వారి ఆల‌యం వ‌ర‌కు, ఘంట‌శాల స‌ర్కిల్ నుండి పూడి రోడ్డు వ‌ర‌కు  విద్యుత్ తోర‌ణాలు, ఎల్ఇడి పందిళ్లు, శుక్ర‌వార‌పు తోట‌లో రంగు రంగుల లైట్లు ఏర్పాటుచేశారు. తిరుచానూరు అమ్మ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌ను స్పీక‌ర్ల ద్వారా తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, రైల్వేస్టేష‌న్ వ‌ర‌కు ప్ర‌సారం చేసేందుకు ఏర్పాట్లు చేప‌ట్టారు.

రోజుకు 5 వేల మంది భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణకు ఏర్పాట్లు చేశారు. ఆల‌యంలో జ‌రిగే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌తోపాటు ఉద‌యం, రాత్రి వాహ‌న‌సేవ‌లను ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. వాహ‌న‌సేవ‌ల్లో క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌ల‌తోపాటు తిరుచానూరులోని ఆస్థానమండపం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రం, రామ‌చంద్ర పుష్క‌రిణి, శిల్పారామం వేదికలపై ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక, సంగీత, నృత్య కార్యక్రమాల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేశారు. తోళ‌ప్ప‌గార్డెన్‌లో ఉన్న డిస్పెన్స‌రీతోపాటు శుక్ర‌వార‌పుతోట‌, ప‌ద్మ‌పుష్క‌రిణి వ‌ద్ద ప్ర‌థ‌మ‌చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.