DyCM OFFERS SILKS TO GODDESS _ శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రివ‌ర్యులు శ్రీ నారాయణస్వామి

Tiruchanoor, 11 Nov 20:The Honourable Dy CM of Andhra Pradesh Sri Narayana Swamy presented silk vastrams on behalf of the State Government on Wednesday at the temple of Goddess Padmavathi in Tiruchanoor. 

These vastrams will be decked to Goddess during the ongoing annual karthika brahmotsavams. 

TTD EO Dr KS Jawahar Reddy, JEO Sri P Basanth Kumar, CVSO Sri Gopinath Jatti, DyEO Smt Jhansi Rani were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రివ‌ర్యులు శ్రీ నారాయణస్వామి

తిరుపతి, 2020 న‌వంబ‌రు  11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజైన బుధ‌వారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రివ‌ర్యులు శ్రీ నారాయణస్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులకు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆల‌యం వెలుప‌ల శ్రీ నారాయ‌ణ‌స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారికి రెండో సారి పట్టువస్త్రాలు సమర్పించ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ. శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సిరిసంప‌ద‌ల‌తో ఉండాల‌ని ముఖ్య‌మంత్రివ‌ర్యులు ఆకాంక్షిస్తున్నార‌ని, శ్రీ‌ప‌ద్మావ‌తి వేంక‌టేశ్వ‌రుల ఆశీస్సులు వారిపై ఉండాల‌ని ప్రార్థించాన‌న్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వో శ్రీ చిరంజీవులు, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి మ‌ల్లీశ్వ‌రి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.