e-OFFICE SPEEDS UP IN TTD_ డిసెంబరు 1వ తేదీ నుంచి మలివిడతగా 11 విభాగాల్లో ఈ-ఆఫీస్‌ అమలు : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 30 November 2017: With TTD fast marching ahead of paperless administration with its effective IT tool, e-Office, Tirupati JEO Sri P Bhaskar reviewed the progress of e-Filing with various HoDs in his chambers in Tirupati on Thursday.

TTD has first implemented the e-office in the first phase in five departments and later in ten departments. The JEO directed the officers concerned to commence the e-filing in the departments which are in second phase from December 1 on wards.

All department HoDs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

డిసెంబరు 1వ తేదీ నుంచి మలివిడతగా 11 విభాగాల్లో ఈ-ఆఫీస్‌ అమలు : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

నవంబరు 30, తిరుపతి, 2017: టిటిడిలో మరింత సులభతరమైన, పారదర్శకమైన పాలన కోసం మలివిడతగా మరో 11 విభాగాలలో డిసెంబరు 1వ తేదీ నుంచి ఈ-ఆఫీస్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో గురువారం ఈ-ఆఫీస్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తొలి విడతలో 5 విభాగాల్లో అమలుచేశామని, మలివిడతలో 11 విభాగాలలో ఈ-ఆఫీస్‌ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. ఇందులో టిటిడి విజిలెన్స్‌, ఎస్‌ఇ-3 మరియు 4, ఎలక్ట్రికల్‌, కల్యాణకట్ట, దాతల విభాగం, పరకామణి, తిరుమలలోని విడిది విభాగం 1 మరియు 2, 3, ఆడిట్‌ విభాగాలు ఉన్నాయని వివరించారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు.

ఈ సమావేశంలో వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.