EDUCATE DEVOTEES ON SRIVARI PUJA KAINKARYAS- TTD EO _ భక్తులకు శ్రీ వేంకటేశ్వర పూజా విధానాన్ని తెలిపి ఆచరించేలా ప్రణాళికలు.

Tirumala, 06 January 2022: TTD EO Dr KS Jawahar Reddy instructed officials to educate devotees on the Sri Venkateswara puja Kainkaryas so that they could emulate them at home.

Addressing a review meeting with Agama advisors, Vedic pundits and officials on Thursday evening the TTD EO instructed officials of HDPP to compile a book on Agama Standards of Srivari Puja kainkaryams and ensure its debate at the next TTD board meeting and later its printing.

He said the book should educate devotees to perform Srivari pujas at home on special days like Ekadasi, Dwadasi, Pournami, and Shravana Nakshatram etc. The should also have data on all puja materials as well. The SVBC channel also should conceive programs on puja practices and guidelines to enthuse devotees to perform such kainkaryas.

JEO Sri Veerabrahmam, Agama advisors Acharya Vedantam Vishnu Bhattacharya, Acharya Sri Mohana Rangacharyulu, All Projects Special Officer Sri Vijay Saradhi, HDPP Secretary Sri Rama Rao, DEO Sri Govindarajan, and Annamacharya Project Director Dr A Vibhishana Sharma were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు శ్రీ వేంకటేశ్వర పూజా విధానాన్ని తెలిపి ఆచరించేలా ప్రణాళికలు.

– అధికారులకు టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదేశం

తిరుమల 6 జనవరి 20 22: శ్రీ వేంకటేశ్వర పూజా విధానాన్ని ప్రతి ఇంట్లో ఆచరించేలా భక్తులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

తన కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన ఆగమ సలహాదారులు, పండితులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆగమ ప్రమాణం,
సశాస్త్రీయంగా శ్రీ వేంకటేశ్వర పూజా విధానం పుస్తకం తయారు చేసి రాబోయే హిందూ ధర్మ ప్రచార పరిషత్ బోర్డు సమావేశంలో ఈ అంశం పై చర్చించి ముద్రణకు శ్రీకారం చుట్టాలన్నారు. శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, శ్రవణానక్షత్రం, ఉత్తర ఫల్గుణ నక్షత్రం, ఇతర పర్వదినాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి పూజ చేసుకునేందుకు వీలుగా ఈ పూజా విధానం పుస్తకం తయారు చేయాలన్నారు. పూజకు అవసరమైన ద్రవ్యాలు ఇతర అంశాలు కూడా పుస్తకంలో పొందుపరచాలన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కూడా భక్తులకు పూజా విధానం తెలియజేసేలా ఈ కార్యక్రమం రూపొందించి ప్రసారం చేయాలని ఆదేశించారు. తద్వారా భక్తులు తమ ఇళ్లలొనే భక్తిశ్రద్ధలతో
శ్రీ వేంకటేశ్వర స్వామి పూజా విధానాన్ని ఆచరించేందుకు వీలు కలుగుతుందని ఈవో చెప్పారు.

జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు ఆచార్య వేదాంతం విష్ణు భట్టాచార్య, ఆచార్య శ్రీ మోహన రంగాచార్యులు, డిప్యూటీ ఈవో లు శ్రీ విజయ సారథి, శ్రీ రామారావు, శ్రీ గోవింద రాజన్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విభీషణ శర్మ సమావేశంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది