EKADASI KALYANOTSAVAM IN UPAMAKA IN EKANTHAM _ మార్చి 23 నుంచి 31వ తేదీ వరకు ఏకాంతంగా ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు

Tirupati, 19 Mar. 21: TTD is organising the Ekadasi Kalyana festival from March 23-31 at Sri Venkateswara temple of Upamaka village in Visakhapatnam district in Ekantham in view of Covid guidelines.

TTD will perform the Pelli Kavadi utsavam at 12.48pm and Ankurarpanam at 5.45 pm on March 23.

The Kalyanotsavam will begin after Dwajarohanam and Pallaki Seva for utsava idols of Sri Venkateshwara and His consorts in between 9.30am and 10.30 am. 

The schedule of events includes Kalyanotsavam in Ekantam on March 25, Vishesh pujas on 26, 27 and Chakrasnanam on March 28.

Dwajavarohanam on March 29 evening and a Pavalinpu Seva is scheduled on March 30 and March 31 during nights.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

మార్చి 23 నుంచి 31వ తేదీ వరకు ఏకాంతంగా ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు

తిరుపతి, 2021 మార్చి 19: విశాఖ జిల్లా ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో మార్చి 23 నుంచి 31వ తేదీ వరకు ఏకాదశి కల్యాణాలు ఏకాంతంగా జరగనున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 12.48 గంటలకు పెళ్లికావడి ఉత్సవం, సాయంత్రం 5.45 నుండి 10.00 గంటల వరకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, రుత్విక్ వ‌రుణం, మృత్సుంగ్రహణము, అంకురార్పణ నిర్వహించనున్నారు.

మార్చి 24వ తేదీ ఉద‌యం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారికి,
శ్రీ సుద‌ర్శ‌న పెరుమాళ్‌కు ఆల‌యంలో ఏకాంతంగా పల్లకిలోకి వేంచేపు చేస్తారు. అనంత‌రం ధ్వ‌జారోహణంతో కల్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి.

మార్చి 25వ తేదీ రాత్రి 10.00 నుండి 12 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహించనున్నారు. మార్చి 26, 27వ తేదీల్లో రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి ఆల‌యంలో ఏకాంతంగా విశేష నివేద‌న‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 28వ తేదీ మ‌ధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు చక్రస్నానం జరగనుంది.

మార్చి 29వ తేదీ సాయంత్రం 5.45 నుండి రాత్రి 6.30 గంటల వరకు ధ్వజావరోహణం, మార్చి 30, 31వ తేదీలలో రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పవలింపుసేవ నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.