BIRRD FREE MEDICAL CAMP AT MARKAPURAM _ బర్డ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 20న (రేపు) మార్కాపురంలో వైద్య శిబిరం

Tirupati, 19 Mar. 21:  TTD is organising a day-long free Medical camp of BIRRD hospital at TTD Kalyana Mandapam in Markapur of Prakasam district on Saturday, March 20.

BIRRD will conduct free tests and treatment to patients with bone and knees ailments.

The camp is being organised as per the directives of TTD Chairman Sri YV Subba Reddy will also process procedures for surgeries if necessary and also provide artificial limbs to the needy.

TTD has appealed to people of Markapur, Erragaddapalem and Giddalur to utilise the opportunity and get treatment.

District ministers and local legislators and others will participate.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బర్డ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 20న (రేపు) మార్కాపురంలో వైద్య శిబిరం

తిరుపతి 19 మార్చి 2021: టీటీడీకి చెందిన బర్డ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం లో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి ఆదేశంతో బర్డ్ ఈ వైద్య శిబిరం నిర్వహించనుంది. ఎముకలు, కీళ్ళ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేసి, మందులు అందిస్తారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సల కోసం ప్రక్రియ చేపడతారు. అవసరమైన వారికి కృత్రిమ కాళ్ళు, చేతులు అందిస్తారు. జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, ఎర్రగొండ పాలెం, గిద్దలూరు తదితర ప్రాంతాల ప్రజలు బర్డ్ ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది