ELABORATE ARRANGEMENTS FOR ANNAPRASADAM DISTRIBUTION _ భక్తులకు విసృతంగా అన్నప్రసాదాలు పంపిణీ

Tirupati, 06 December 2024: Devotees expressed their happiness that TTD Annaprasadam Department provided special and extended services during this year Panchami Theertham fete at Tiruchanoor on the occasion of Sri Padmavati Ammavari annual Kartika Brahmotsavam. 

Four holding zones   Were set up in Tiruchanoor for devotees from Tamil Nadu, Karnataka, united Chittoor, Kadapa and Nellore districts to participate in the holy dip event.

More than a hundred Annaprasadam centres were set up at the holding points of Navajeevan Hospital, Pudi, SV High School and Tholappa Gardens. 

Annaprasadam, drinking water, badam milk, coffee, kadamba sadam, checkera pongali, daddojanam, biscuits and vegetable upma were distributed to the devotees waiting at the holding points from the night of December 5. 

To witness of Sri Padmavati Ammavari Brahmotsavams 20

LED screens have been installed at holding zones and elsewhere in Tiruchanoor.

Devotees lauded the TTD services which included the supply of  Drinking water, mobile toilets, medical and health services and also hailed the services of Srivari Sevaks.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు విసృతంగా అన్నప్రసాదాలు పంపిణీ

తిరుపతి, 2024, డిసెంబర్ 06.: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థం సందర్భంగా టిటిడి అన్నప్రసాదం విభాగం విశేష సేవలు అందించినట్లు భక్తులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడు , కర్నాటక, ఉమ్మడి చిత్తూరు, కడప , నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన భక్తులకు తిరుచానూరులో నాలుగు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నవజీవన్ ఆసుపత్రి, పూడి, ఎస్వీ హైస్కూల్, తోళ్లప్ప గార్డెన్ లలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్లులో దాదాపు వందకు పైగా అన్నప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. హోల్డింగ్ పాయింట్లులో వేచియుండే భక్తులకు 5వ తేదీ రాత్రి నుంచి అన్నప్రసాదాలు, తాగునీరు, బాదంపాలు, కాఫీ, కదంబం , చెక్కెర పొంగలి, దద్దోజనం, బిస్కెట్లు, వెజిటబుల్ ఉప్మా పంపిణీ చేశారు. ఆయా హోల్డింగ్ పాయింట్లులో అక్కడే వేచి వుండేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. టిటిడిలోని అన్ని విభాగాలు, పోలీసులు , శ్రీవారి సేవకులు సహకారంతో పంచమి తీర్థం సందర్భంగా లక్షకు పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దాదాపు 25 వేలకు పైగా బిస్కెట్ ప్యాకెట్ లను పంపిణీ చేశారు.

శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల విశేషాలను తిలకించేలా  ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు, మొబైల్ మరుగుదొడ్లు, వైద్యం, ఆరోగ్య సేవలు అందించారు. టిటిడి కల్పించిన సౌకర్యాలుపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది