ELECTRIC BATTERY CARS TO PROTECT TIRUMALA ENVIRONS FROM POLLUTION SOON – TTD EO_ ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 1 December 2017: The management of TTD is contemplating to introduce Electric battery cars by January next as a preventive measure to protect Tirumala environs from vehicular pollution, said TTD EO Sri Anil Kumar Singhal.

During the monthly Dial Your EO programme which took place at Annamaiah Bhavan in Tirumala on Friday, the EO answered 23 callers from across the country on various issues. Some excerpts.

Reacting to the suggestion by a pilgrim caller Sri Yaswanth from Bengaluru the EO said, TTD has taken up massive plantation programme in Tirumala. “Except the Srivari Seva Building, we have not taken up any other constructions in Tirumala keeping in view the importance of environs. To reduce vehicular pollution we are planning to introduce 60 electric vehicles by January 2018”, he maintained.

SOFT SKILLS TO SRIVARI SEVAKULU

Another caller Smt Lakshmi from Hyderabad brought to the notice of TTD EO about the rude behaviour of srivari seva volunteers while manning queue lines inside Tiruchanoor temple, for which the EO instructed the concerned to develop soft skills to seva volunteers.

CHECK UNAUTHROISED HAWKERS IN VQC

Welcoming the feed back from a pilgrim Sri KV Reddy from Bengaluru, the EO said, TTD vigilance officials will inspect the Vaikuntham Queue Complex to check the menace of unauthorised hawkers who are selling snacks and eateries to pilgrims waiting in compartments.

SEPARATE TIME SLOTS FOR PHC AND AGED

Callers Sri Padmanabhan from Adambakkam, Smt Bharati from Hindupur sought the EO for special darshan for physically challenged and ailing pilgrims. Responding to them the EO said already the Physically Challenged and aged pilgrims are allowed in two slots every day at 10am and 3pm respectively with 750 pilgrims per slot except on Fridays where there will be only afternoon slot. “The pilgrims suffering from kidney, heart and arthritis also are allowed during these darshan slots”, he added.

NON-HINDUS ARE NOT GIVEN ROOMS

A pilgrim caller Sri Mastanvalli from Ongole brought to the notice of EO that he was an ardent devotee of Lord Venkateswara but he was denied accommodation in Tirumala since he was a non-Hindu. Reacting to the caller, the EO said, there is no such restriction. But If he faces similar instance in future he can lodge a complaint in TTD Help Desk.

PRIVATE VEHICLES MENACE NEAR ANNAPRASADAM

Another caller Sri Kishen from Siddhipeta said, the private vehicles are causing lot of inconvenience to pilgrims near Annaprasadam. The EO said, immediate measures will be taken to check the problem.

TELECAST SVBC IN HINDI

Sri Ganesh, a pilgrim from Maharastra sought the EO to telecast the SVBC programmes in Hindi. The EO said, TTD will soon release Hindi version of website. “At present we have SVBC in Telugu, Tamil and Kannada. However the scrolling in SVBC are now translated in Hindi for the information of pilgrims”, he added.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆన్‌లైన్‌లో 53,428 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :

‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

డిసెంబరు 01, తిరుమల 2017: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2018, మార్చి నెల కోటాలో మొత్తం 53,428 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,843 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 8,103, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో మొత్తం 42,585 సేవాటికెట్లు కాగా, వీటిలో విశేషపూజ 1,500, కల్యాణం 10,125, ఊంజల్‌సేవ 2,700, ఆర్జితబ్రహ్మూెత్సవం 5,590, వసంతోత్సవం 10,320, సహస్రదీపాలంకారసేవ 12,350 ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. గీతాకుమారి – నల్లచర్ల, సూర్యప్రకాశ్‌ – హైదరాబాద్‌, విజయకుమార్‌ – రాయచోటి, పురుషోత్తం- బెంగుళూరు, గీతాకుమారి – బెంగుళూరు.

ప్రశ్న: ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో శ్రీవారి ఆర్జితసేవలు పొందడం కష్టతరంగా ఉంది ?

ఈ.వో. ఎక్కువ మంది భక్తుల కోరిక మేరకు శ్రీవారి ఆర్జితసేవలను ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో కేటాయిస్తున్నాం. భక్తులు నమోదు చేసుకునేందుకు వారం రోజులు సమయం ఉంటుంది. కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

2. వేణుగోపాల్‌ – బెంగళూరు, పద్మ – నందలూరు, పద్మనాభం – చెన్నై.

ప్రశ్న: రూ.300/- ప్రత్యేకప్రవేశ దర్శనం క్యూలైన్‌లో వృద్ధుల కోసం మధ్యలో బెంచీలు ఏర్పాటుచేయండి ?

ఈ.వో. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రతిరోజూ ఉదయం 10 గం||లకు 750 టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు 750 టోకెన్లు జారీ చేసి శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. నెలలో రెండు రోజుల పాటు 4 వేల టోకెన్లు ప్రత్యేకంగా జారీ చేస్తున్నాం. వీరు వేచియుండేందుకు ప్రత్యేక షెడ్‌ను ఏర్పాటుచేశాం.

3. మల్లేశ్వరరావు – విజయవాడ

ప్రశ్న: సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనం ఆలస్యమవుతోంది ?

ఈ.వో. సర్వదర్శనం భక్తులు ఎక్కువ సేపు కంపార్ట్‌మెంట్లలో వేచియుండకుండా చూసేందుకు వీలుగా డిసెంబర్‌ రెండో వారం నుంచి ప్రయోగాత్మకంగా టైం స్లాట్‌ అమలుచేస్తాం. ఇందుకోసం మొదటి విడతగా తిరుమలలోని 14 ప్రాంతాలలో 107 టోకెన్‌ జారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.

4. నాగేశ్వరరావు – నెల్లూరు

ప్రశ్న: కల్యాణం టికెట్ల భక్తులకు దగ్గర నుంచి శ్రీవారి దర్శనం కల్పించండి ?

ఈ.వో. శ్రీవారి కల్యాణోత్సవం భక్తులకు ప్రస్తుత విధానం కొనసాగుతుంది.

5. రంగనాథం – ఒంగోలు

ప్రశ్న: తిరుమలలోని ఎంప్లాయిస్‌ క్యాంటిన్‌లో భోజనం చేసేందుకు శ్రీవారి సేవకులను అనుమతించడం లేదు ?

ఈ.వో. ఎంప్లాయిస్‌ క్యాంటిన్‌లో ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తారు. త్వరలో ప్రారంభం కానున్న నూతన శ్రీవారి సేవా సదన్‌లో శ్రీవారి సేవకులకు భోజనం, వసతి తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.

6. గణేష్‌ – మహారాష్ట్ర

ప్రశ్న: హిందీలో ఎస్వీబీసీ ప్రసారాలు అందించండి ?

ఈ.వో. ఎస్వీబీసీలో తెలుగు, తమిళం, కన్నడ ప్రసారాలను అందిస్తున్నాం.

7. మనోహర్‌ – వరంగల్‌

ప్రశ్న: శ్రీవారి సేవకుల గ్రూప్‌ను విడగొట్టి సేవా విధులు కేటాయిస్తున్నారు. దీనివల్ల కొత్తవారికి ఇబ్బందిగా ఉంది ?

ఈ.వో. భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు శ్రీవారి సేవకుల వయసు, విద్యార్హత, అనుభవం ఆధారంగా ఆయా విభాగాల్లో సేవా విధులు కేటాయిస్తున్నాం.

8. లక్ష్మీ – హైదరాబాద్‌

ప్రశ్న: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విఐపిలు వచ్చినప్పుడు సర్వదర్శనం భక్తులకు ఇబ్బందిగా ఉంది. శ్రీవారి సేవకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఉద్యోగుల అరుపులతో ఏకాంతసేవను భక్తులు సరిగా చూడలేకపోతున్నారు. ?

ఈ.వో. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఇకపై అలా జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

9. యశ్వంత్‌ – బెంగళూరు

ప్రశ్న: తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు వాహనాలకు కాలుష్య తనిఖీలు నిర్వహించండి, భవననిర్మాణాల కోసం చెట్లను తొలగించకుండా చూడండి ?

ఈ.వో. తిరుమలలో ప్రైవేట్‌ నిర్మాణాలను అనుమతించడం లేదు. రూ.6 కోట్ల వ్యయంతో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపడుతున్నాం. ప్రతి వాహనానికీ కాలుష్య తనిఖీలు చేయడం కష్టసాధ్యం. త్వరలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి చర్యలు చేపడుతున్నాం.

10. కె.వి.రెడ్డి – బెంగళూరు

ప్రశ్న: సర్వదర్శనం కంపార్ట్‌మెంట్లలో అనధికార హాకర్లు తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ?

ఈ.వో. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

11. భాస్కర్‌ – బొబ్బిలి

ప్రశ్న: ఈ దర్శన్‌ కౌంటర్లలో ఆర్జిత సేవలను పునరుద్దరించండి ?

ఈ.వో. ఎక్కువ మంది భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలను కేటాయిస్తున్నాం.

12. కిషన్‌ – సిద్దిపేట

ప్రశ్న: మేము శ్రీవారి సేవకు వస్తుంటాం. అన్నదానం కాంప్లెక్స్‌ వద్ద ప్రైవేట్‌ వాహనాల వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ?

ఈ.వో. ఈ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.

13. మస్తాన్‌ వలీ – ఒంగోలు

ప్రశ్న: దూదేకుల వర్గానికి చెందిన మాకు తిరుమలలో గదుల బుకింగ్‌ సమయంలో అభ్యంతరం తెలుపుతున్నారు?

ఈ.వో. గదుల బుకింగ్‌ సమయంలో అభ్యంతరాలు ఎదురైతే హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేయండి.

14. భారతి – హిందూపురం

ప్రశ్న: కిడ్నీ వ్యాధిగ్రస్తులను మహాద్వారం నుండి పంపండి ?

ఈ.వో. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులను వృద్ధులు, దివ్యాంగుల క్యూలైన్లలో పంపుతున్నాం.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మీ, డిప్యూటీ ఈవోలు శ్రీ వేణుగోపాల్‌, శ్రీ రాజేంద్రుడు, శ్రీమతి నాగరత్న ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.