EO VISITS SILATORANAM, CHAKRATEERTHAM, INSPECTS SSD AT VSRH_ శిలాతోరణం, చక్రతీర్థంను సందర్శించిన ఈవో, జెఈవో :

Tirumala, 1 December 2017: TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna inspected Natural Rock Arch and Chakrateertham in Tirumala on Friday.

The EO instructed the SE II Sri Ramachandra Reddy to set up a view point for the sake of pilgrims to view the beauty of natural arch which is said to be about 150 crore years old.

He later visited Chakrateertham and offered prayers to Lord Shiva, Sri Sudarshana Chakrattalwar, Sri Lakshmi Narasimha Swamy, Sri Anjaneya Swamy located here amidst the rich scenic beauty. He also complimented the Engineering officials for making the difficult path pilgrim friendly by barricading the valley and laying steps.

Later he donated Tulasi plants to devotees and also planted some plants in Nakshatra-Rasi vanam developed by forest wing officials.

The EO visited the Slotwise Sarva Darshanam counter which is coming up near Varaha Swamy Rest House.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శిలాతోరణం, చక్రతీర్థంను సందర్శించిన ఈవో, జెఈవో :

డిసెంబరు 01, తిరుమల 2017: తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థాన్ని ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు సందర్శించారు. జియాలజిస్టుల ప్రకారం శిలాతోరణం ఆర్చికి 1500 మిలియన్‌ సంవత్సరాల వయసు ఉందని ఈవో తెలిపారు. దేశంలోనే అతిపురాతన శిలాతోరణంగా దీనికి గుర్తింపు లభించిందని, మరింత మంది భక్తులు సందర్శించేందుకు వీలుగా చర్యలు చేపడతామని అన్నారు. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన చక్రతీర్థం మనోహరంగా ఉందన్నారు. ఇక్కడ సుదర్శన చక్రత్తాళ్వార్‌, శివాలయం వద్ద సుందరీకరణ పనులు చేపడతామన్నారు. అనంతరం శిలాతోరణం పక్కన గల అటవీ వనంలో ఈవో, జెఈఓలు తమ రాశులు, నక్షత్రాల ప్రకారం ఆయా మొక్కలను నాటారు. ఆ తరువాత దశావతార వనాన్ని, శ్రీగంధం మొక్కల పెంపకానికి అనువుగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. చివరగా వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద ఏర్పాటుచేస్తున్న సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్‌ను పరిశీలించారు.

ఈవో వెంట ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, విఎస్‌వో శ్రీరవీంద్రారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.