ELECTRIC TWO-WHEELERS DONATED _ శ్రీవారికి 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విరాళం
Tirumala, 15 November 2024: Sri C. Venkata Nagaraja, MD of Pearl Minerals and Mines Private Limited, Hyderabad, donated 15 TVS Electric Two-Wheelers to Tirumala on Friday.
TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary participated in the puja held for these vehicles at the temple premises.
Later, the donor handed over the keys of the vehicles to the Additional EO. The donor said that the cost of these vehicles is around Rs. 22 lakhs.
Deputy EO Sri Lokanatham, VGO Sri Surendra, Tirumala DI Sri Subramaniam participated in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారికి 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విరాళం
తిరుమల, 2024 నవంబరు 15: తిరుమల శ్రీవారికి హైదరాబాద్ కు చెందిన పెరల్ మినిరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీ సి.వెంకట నాగరాజ శుక్రవారం 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు.
ముందుగా అలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు. ఈ వాహనాల ధర దాదాపు రూ.22 లక్షలు అని దాత తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీవో శ్రీ సురేంద్ర, తిరుమల డీఐ శ్రీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.