RAMA NAMA SMARANA RESOUNDS AT BALAKANDA AKHANDA PARAYANAMS _ రామనామస్మరణతో సాగిన బాలకాండ అఖండ పారాయ‌ణం

Tirumala,6, November 2022: Seeking blessings of lord Venkateshwara for the well-being of humanity TTD organised the 13th edition of Balakanda Akhanda Parayanams on Sunday morning at Nada Niranjanam platform.

 

The fete held in the presence of the utsava idols of Sri Hanumant sameta Sita Rama Lakshmana resounded with the devotional fervour of Rama Nama smarana in the hill shrine.

 

The parayanams by Vedic pundits accompanied by TTD EO Sri AV Dharma Reddy comprised of 137 shlokas of 61-65 sargas of Akhanda Balakanda along with 25 shlokas from Yogasista-Dhanvanthri Maha mantras.

 

Eminent Vedic pundits Acharya Pava Ramakrishna Somayaji of SV Vedic university, Sri K Ramanujacharya and Sri PVNN Maruti of Dharmagiri Veda Pathashala besides acharyas of SV Vedic university and parayanadars of SV Vedic higher studies institute, pundits from national Sanskrit university.

 

TTD officials pundits and a large number of devotees were present.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రామనామస్మరణతో సాగిన బాలకాండ అఖండ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2022 నవంబరు 06: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు 13వ‌ విడ‌త బాల‌కాండ అఖండ పారాయ‌ణం భక్తజనరంజకంగా జరిగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల సమక్షంలో కార్యక్రమం ఆద్యంతం రామనామస్మరణతో సాగింది.

ఇందులో 61 నుండి 65 సర్గల వ‌ర‌కు గ‌ల 137 శ్లోకాలను పారాయణం చేశారు. యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయ‌ణం చేయ‌గా ప‌లువురు భ‌క్తులు భ‌క్తిభావంతో వారిని అనుస‌రించి శ్లోక పారాయ‌ణం చేశారు. టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య ప్రవా రామ‌కృష్ణ సోమ‌యాజి, ధర్మగిరి వేద పాఠశాల పండితులు శ్రీ కె.రామానుజాచార్యులు, శ్రీ పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన పండితులు పాల్గొన్నా‌రు. హైదరాబాదుకు చెందిన శ్రీ నాగరాజు బృందం కార్యక్రమం మొదట్లో “ఎంతో రుచిరా … చివర్లో “వీరమారుతి గంభీర మారుతి….” భజన కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.