ENHANCE HYGIENE AT KALYANA KATTA – TTD EO _ కళ్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగవ్వాలి -⁠ ⁠టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు

Tirumala,23 July 2024: TTD EO Sri J Syamala Rao on Tuesday directed officials concerned to enhance the hygiene and sanitation at Kalyankatta and provide hot water continuously to the pilgrims offering tonsuring.

After the inspection of the main kalyana katta along with JEO Smt Goutami, the EO directed officials to clean up the tonsured hair, repair broken tiles in bathrooms and avoid inconvenience to the pilgrims

Among others he directed the agency officials to provide qualitative sanitary materials.

Thereafter he also visited Marusri Tarigonda Vengamamba Anna Prasadam Complex and interacted with the pilgrims over the taste of Annaprasadam being served to them.

The devotees also expressed satisfaction at the taste of recipes.

SE-2 Sri Jagadeeshwar Reddy, DE( electrical) Sri Ravi Shankar Reddy, EE Sri Jaganmohan Reddy DyEOs Sri Rajendra, Smt Asha Jyoti Incharge health officer Dr Sunil Kumar, AEO( KKC ) Sri Ramakanth, Special Catering Officer Sri Shastry and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కళ్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగవ్వాలి

•⁠ ⁠అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు

•⁠ ⁠టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు

తిరుమల, 2024 జూలై 23: శ్రీవారి కల్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగుపరచాలని, తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో
శ్రీ జె.శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టను ఈవో, జేఈఓ (విద్యా, ఆరోగ్యం) శ్రీమతి గౌతమితో కలిసి కళ్యాణకట్టలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.

కళ్యాణ కట్టలో ఇంకను శుభ్రపరచని తల వెంట్రుకలను ఎప్పటికప్పుడు తీసివేసి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బాత్ రూంలు, ఇతర హాల్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డిటిఎస్ ఏజెన్సీ వారు నాణ్యమైన శానిటరీ పరికరాలు, వస్తువులు ఎప్పటికప్పుడు సరఫరా చేసేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కళ్యాణ కట్టలోని అత్యంత పాత గీజర్లు, పగిలిన టైల్స్ ను గమనించి వాటిని వెంటనే మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే విరిగిన నీటి కొళాయిలు, పనిచేయని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

అనంతరం ఈవో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేశారు. టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలలో అన్నం బాగా ఉడికిందా, కూరలు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత చేతులు కడుగుకునే కుళాయిలు కొన్ని పనిచేయడం లేదని, వాటిని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, అన్నదానం డిప్యూటీవో శ్రీ రాజేంద్ర, ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఆరోగ్యశాఖ డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, ఇన్ ఛార్జ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, ఎస్ ఈ- 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఇ (ఎలక్ట్రికల్) రవి శంకర్ రెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, కెకెసి ఏఈఓ శ్రీ రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.