ENHANCE VILLAGE LEVEL PROPAGATION OF HINDU DHARMA- TTD EO _ గ్రామ‌స్థాయిలో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చారం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్

Tirupati, 13 Dec. 19: TTD Executive Officer Sri Anil Kumar Singhal has urged officials to take up Sanatana Hindu Dharma propagation in a big way in rural areas.

Addressing a review meeting at the TTD administrative building he said TTD had taken up Managudi program four times a year to spread the message of values of sanatana Hindu dharma and significance of Hindu temples.

He said Srivari Sevakulu and trained archakas played a major role in that task. 

ARCHAKA TRAINING 

The EO instructed officials to ensure imparting extended training in Puja vidhanam in second and third phases of archaka training and also take up distribution of books on deities in villages.

SUBHAPRADHAM:

He said the institutions like Isckon and Ramakrishna mission should be  involved in the Shubhapradam program in which  thousands of students were imparted knowledge of dharma and Hindu traditions since 2012.

SANATANA DHARMA EXAMS:

He also directed the SVBC to telecast the content for the annual Sanatana dharma exams in which thousands of students participated during summer vacation.

GEETHA JAYANTHI: 

He also asked the TTD Joint executive officer Sri P Basant Kumar to take steps to provide one year free subscription of Saptagiri magazine for meritorious students who excelled in annual Geeta Jayanti essay writing competitions. 

SRI VENKATESWARA RATHA YATRA: 

He said the Sri Venkateswara Rathayatra campaign in rural areas should also comprise of Bhakti sangeet, mythological films to enthuse students in schools.

Earlier HDPP secretary Acharya Rajagopalan made a power point presentation on activities and projections of HDPP.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

 

గ్రామ‌స్థాయిలో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చారం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్

తిరుప‌తి, 2019 డిసెంబ‌రు 13: టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో గ్రామ‌స్థాయిలో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చారం చేయాల‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఈవో కార్యాల‌యంలో శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ  సమాజంలో సనాతన భారతీయ హైందవ ధర్మ విలువలు నింపి, భావితరాలకు ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు టిటిడి గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా సంవ‌త్స‌రానికి 4 సార్లు మ‌న‌గుడి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో శ్రీ‌వారిసేవ‌కులు, ఇదివ‌ర‌కే అర్చ‌క శిక్ష‌ణ తీసుకున్న అర్చ‌కుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు. గ్రామ‌స్థాయిలో ఉన్నఆల‌యాల అర్చ‌కుల‌కు ఆర్ధిక స‌హాయం అందించ‌డానికి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు  రూపొందించాల‌న్నారు. త‌ద్వార మ‌రిన్ని ధార్మిక‌ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌వ‌చ్చ‌న్నారు. ప‌టిష్ఠ‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించ‌డం ద్వారా టిటిడికి గ్రామ‌స్థాయిలోని అర్చ‌కుడితో నేరుగా సంబంధాలు ఏర్ప‌డ‌తాయ‌ని తెలిపారు.

అర్చ‌క శిక్ష‌ణ –

అర్చ‌క శిక్షణలో భాగంగా పూజ‌ విధానంపై మొద‌టి, 2వ, 3వ విడ‌త‌ల‌లో శిక్ష‌ణ ప‌టిష్ఠంగా  నిర్వ‌హించాల‌న్నారు. ప్ర‌ది భ‌జ‌న మందిరంలో పుస్త‌కాలు పెట్టుకునేందుకు ర్యాక్ , వివిద దేవ‌తా మూర్తులకు సంబంధించిన పుస్త‌కాలు ఏర్పాటు చేయాల‌న్నారు. ఆయా గ్రామ‌స్తులు చ‌దువుకునేందుకు వీలుగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. త‌ద్వార గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావ‌చ్చ‌న్నారు.

శుభ‌ప్ర‌దం –

యువ‌త‌లో భారతీయ సనాతన ధర్మం, మానవీయ, నైతిక విలువలు బోధించేందుకు ఉద్దేశించిన ‘శుభప్రదం’ వేసవి శిక్షణ తరగతులలో మ‌రింత ఎక్కువ మందిని భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు. 2012 నుండి గత  8 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్ధులకు శుభప్రదం శిక్షణా తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో రామ‌కృష్ణ మ‌ఠం, ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థ‌ల స‌హ‌కారం తీసుకునేలా చ‌ర్య‌లు తీసుకొవాల‌న్నారు.

స‌నాత‌న ధార్మిక ప‌రీక్ష‌లు –

భావి భారత నిర్మాతలైన విద్యార్ధులను తాత్కాలికమైన భౌతిక ఆనందాల కంటే శాశ్వతమైన మానసిక ఆనందాన్ని పొందేందుకు స‌నాత‌న ధ‌ర్మంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు టిటిడి స‌నాత‌న విజ్ఞాన పరీక్షలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైయ్యే విద్యార్థుల‌కు విష‌యాలు (కంటేంట్‌) ముందుగానే ఎస్వీబిసి ప్ర‌సారం చేయాల‌న్నారు. అదేవిధంగా సంబంధిత అంశాల‌పై విష‌య ప‌రిజ్ఞానుల‌తో విద్యార్థుల‌ సందేహాలు నివృతి చేయాల‌న్నారు.

గీతా జ‌యంతి –

భ‌గ‌వ‌ద్గీత గొప్ప‌త‌నాన్ని భావిభార‌త పౌరులైన విద్యార్థుల‌కు తెలియ‌జేసేందుకు వ్యాసాలు రాయించ‌డం, ఇందులో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌ప‌రిచిన విద్యార్థుల‌కు ఒక సంవ‌త్స‌రం పాటు స‌ప్త‌గిరి మాస ప‌త్రిక‌ను ఉచితంగా అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అదేవిధంగా స‌ప్త‌గిరి మాస ప‌త్రిక‌లో చిన్న పిల్ల‌లకు బొమ్మ‌ల‌తో కూడిన క‌థ‌ల‌ను ముద్రించేంద‌కు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ను కోరారు.  

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర –

శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయడంతో పాటు యువతలో సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని  మరింత పెంచేందుకు శ్రీ  వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.  గ్రామాల‌లో ర‌థంతో పాటు భ‌క్తి సంగీత‌, పౌరాణిక చిత్రాల ఆడియో, వీడియో చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శంచాల‌న్నారు. అయా ప్రాంతాల‌లోని పాఠ‌శాల‌ల‌కు వెళ్ళి విద్యార్థుల‌కు తెలియ చేయాల‌న్నారు.

అంత‌కుముందు డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌క్ర‌మాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.