ENSURING POSITIVE PILGRIMAGE EXPERIENCE IS OUR FOREMOST DUTY-TTD ADDITIONAL EO _ భక్తులకు తిరుమల యాత్ర మధురానుభూతిని కలిగించడమే మన కర్తవ్యం : – టీటీడీ ఆదనపు ఈవో

HOISTS NATIONAL FLAG

TIRUMALA, 15 AUGUST 2024: Ensure a positive pilgrimage experience to the scores of devotees visiting Tirumala across the globe said, the TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary.

During his I-Day speech after hoisting the National Flag on the occasion of the 78th Independence Day at GokuIam Rest House premises in Tirumala on Thursday, he said many great leaders have dedicated their lives for bringing freedom to the Nation. 

”Our Hindu Santana Dharma, puranas, sacred texts have taught us the spirit of selfless service, sacrifice and truth with which our great freedom fighters achieved freedom. Travelling in their path, all the employees should pledge to give utmost dedicated services with team work, so that the pilgrims experience positive vibes and return their homes with a memorable Tirumala Pilgrimage experience”, he said.

Adding further, the additional EO said, ”Today we are providing hassle-free darshan to nearly 85 thousand devotees per day and the employees of TTD are rendering round-the-clock services in terms of providing qualitative  Annaprasadam, keeping the premises clean,  proper queue line management, ensuring hassle free darshan to devotees with a great team work.

In coming years we all pledge to offer enhanced services to the pilgrims and enrich the reputation of TTD across the globe and stand as a role model to other religious institutions”, he asserted.

All heads of Tirumala departments including SE2 Sri Satyanarayana, Dy EOs Sri Bhaskar, Sri Venkataiah, VGOs Sri Surendra, Sri NTV Ramakrishna and other officers were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు తిరుమల యాత్ర మధురానుభూతిని కలిగించడమే మన కర్తవ్యం :

– జాతీయ నాయకుల స్ఫూర్తితో సేవలందించాలి

– టీటీడీ ఆదనపు ఈవో


తిరుమల, 2024 ఆగష్టు 15: భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని టిటిడి ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించి, తిరుమల యాత్ర భక్తుల మనసులో మధురానుభూతిని మిగిల్చే విధంగా విధులు నిర్వహించాలని ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు.

తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం కోసం ఎందరో మహానేతలు తమ జీవితాలను అంకితం చేశారన్నారు. ”మన సనాతన హిందూ ధర్మం, పురాణాలు, వేదాలు మనకు నిస్వార్థ సేవ, త్యాగం మరియు సత్యాన్ని బోధించాయన్నారు. ఆ మార్గంలోనే మన స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రం సాధించారన్నారు. వారి బాటలో పయనిస్తూ, ఉద్యోగులందరూ సమన్వయంతో, అత్యంత అంకితభావంతో భక్తులకు సేవలు అందిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. తద్వారా యాత్రికులు మరపురాని తిరుమల తీర్థయాత్ర అనుభవంతో వారి ఇళ్లకు తిరిగి వేళతారని ” ఆయన చెప్పారు.

” రోజుకు దాదాపు 85 వేల మంది భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామని, టీటీడీ ఉద్యోగులు నాణ్యమైన అన్నప్రసాదాలు అందించడంతోపాటు, క్యూ లైన్‌లు, ఇతర ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచడంలో 24 గంటలూ ఉత్తమ సేవలందిస్తున్నారన్నారు. రాబోయే రోజులలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించి, ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఖ్యాతిని పెంపొందించే విధంగా, వివిధ ఆధ్యాత్మిక సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలిచేందుకు బాధ్యతలు నిర్వహించాలని’’ అని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన టీటీడీకి, భక్తులకు విశేష సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు, టీటీడీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేస్తున్న మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ2 శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీ వెంకటయ్య, శ్రీమతి ఆశా జ్యోతి, విజివోలు శ్రీ సురేంద్ర, శ్రీ ఎన్‌టివి రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.