SPREAD ANNAMACHARYA SANKEERTAN TO ALL, SAYS TTD EO_ అన్నమయ్య సంకీర్తనలను వ్యాప్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirupati, 29 Aug. 19: TTD Executive Officer Sri Anil Kumar Singhal today urged officials to utilize Annamacharya sankeertan to spread Sanatana dharma.
Addressing officials at the TTD administrative building on Thursday morning, the EO directed Annamacharya Project director Sri Vishwanatham to organize programs of Annamacharya sankeertan in schools and villages of all districts and also conduct opinion poll among devotees on how far it supported the Sanatana Dharma Propaganda.
He said a large population in the country was well versed in Tamil and Sanskrit, which was the basis of the Alwar Divya Prabandam Project. He advised the Project Special Officer to utilize services of such scholars for translating the Alwar texts into other languages.
He also instructed officials of Dasa Sahitya Project to prepare an annual calendar of events and he wanted JEO Of Tirupati Sri P Basant Kumar to conduct a review of the functioning of all TTD projects at earliest.
The TTD EO wanted officials to modernize all Kalyana mandapams with bright paint, fire-fighting equipment, civil and electrical up-gradation to attract devotees.
He urged engineering officials to prepare special almirahs at the storeroom inside the Srivari temple store to keep kitchen materials for cooking pradadams.
He asked officials of TTD Kalyana Katta to devise new methods for drying up long hair collected after tonsuring. He also wanted water conservation steps at Tirumala taken to minimize wastage of precious water resources.
Tirumala Special Officer Sri AV Dharma Reddy, Tirupati JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jetty, Chief Engineer Sri Ramachandra Reddy, FACAO Sri O Balaji, CAO Sri Sesha Sailendra, prominent Audit adviser Sri Narasimha Murthy and others participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అన్నమయ్య సంకీర్తనలను వ్యాప్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుపతి, 2019 ఆగస్టు 29: సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో గురువారం ఉదయం అంతర్గత ఆడిట్‌పై సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ద్వారా అన్నమయ్య సంకీర్తనలు వ్యాప్తి చేసేందుకు అన్ని జిల్లాలల్లోని గ్రామాలు, పాఠశాలల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విశ్వనాథంను ఆదేశించారు. కార్యక్రమాల అనంతరం ధర్మప్రచారానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంత వరకు ఉపయోగ పడుతుందనే విషయమై భక్తుల నుండి అభిప్రాయ సేకరణ నిర్వహించాలని సూచించారు.
ఆళ్వారు దివ్య ప్రభంధ ప్రాజెక్టు ద్వారా తమిళం మరియు సంస్క తం కలిసిన మని ప్రవలం భాష తెలిసినవారు దేశంలో చాల అరుదుగా ఉన్నారన్నారు. ఆ భాషకు సంబంధించిన గ్రంథాలను ఇతర భాషలలోనికి అనువదించడానికి నిష్ణాతులైన పండితుల సేవలు వినియోగించుకోవాలని ఆళ్వారు దివ్య ప్రభంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిని ఆదేశించారు. అదేవిధంగా టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు సంవత్సరం మొత్తం నిర్వహించే కార్యక్రమాలతో వార్షిక క్యాలెండర్ రూపొందించాలని దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారిని ఆదేశించారు. టిటిడి ప్రాజెక్టులపై త్వరలో సమీక్ష నిర్వహించాలని తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌కు సూచించారు.
అత్యాధునిక వసతులతో టిటిడి కల్యాణ మండపాల స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా భక్తులను ఆకట్టుకునేలా మరింత ఆకర్షణీయంగా పెయింటింగ్, అగ్ని ప్రమాద నివారణ పరికరాలు, ఇతర సివిల్, ఎలక్ట్రికల్ పనులు చేయాలన్నారు. తద్వార ఎక్కువ మంది భక్తులకు టిటిడి కల్యాణ మండపాలు ఉపయోగించుకుంటరని తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయం చెంత ఉన్న ఉగ్రాణంలో ప్రసాదాల తయారీకి ఉపయోగించే వంట సరుకులు నిల్వచేసేందుకు అవసరమైన అల్మారాలను ప్రత్యేకంగా తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కల్యాణకట్టలో భక్తులు సమర్పించే తలనీలలో పొడవాటి తలనీలాను ఆరపెట్టేందుకు నూతన పద్దతులను అవలంభించాలన్నారు. తిరుమలలోని నీటి ప్రాజెక్టుల నుండి ఉపయోగించే నీరు వృధా కాకుండా నిరంతర పర్యవేక్షణతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌జెట్టి, సిఇ శ్రీ రామచంద్రరెడ్డి, ఎఫ్‌ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజి, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ప్రముఖ అడిట్ సలహాదారులు శ్రీ నరసింహమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.