LAKSHA KUMKUMARCHANA AT SRI KT ON AUG 30_ ఆగస్టు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
Tirupati, 29 Aug. 19: TTD has organised Laksha Kumkumarchana of Goddess Kamakshi ammavaru at TTD local temple of Sri Kapileswara Swamy Temple on August 30, Friday.
The unique ritual will be performed in three phases, morning, afternoon and evening in which interested devotees could participate with ₹200 ticket and beget one Laddu and kumkuma prasadam. The utsava idol of Kamakshi ammavaru will be paraded on the streets of temple town later in the evening.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
తిరుపతి, 2019 ఆగస్టు 29: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 30వ తేదీ శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
రూ.200/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక లడ్డూ, కుంకుమ ప్రసాదంగా అందజేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.