EO BRIEF ON THE HIGHLIGHTS OF VAIKUNTHA DWARA DARSHANAM _ 4.26 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirumala, 4 Jan. 21: After the successful completion of the first ever Vaikuntha Dwara Darshanam opened up by TTD in Tirumala for ten days from December 25 till January 3, TTD EO Dr KS Jawahar Reddy along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti briefed media at Annamaiah Bhavan in Tirumala on Monday over the highlights of the maiden ten day festivity.

Initially, EO thanked all the Peethadhipathis, Pedda Jiyar and Chinna Jiyar Swamijis of Tirumala, Agama Scholars for approving the decision to open up Vaikuntha Dwaram for ten days in Tirumala abiding to the Agama Shastra and enabling more number of devotees from across the country to experience the Vaikuntha Dwara Darshanam.

Later he also thanked the strong work force of TTD for ensuring hassle free darshan to pilgrims with their team work, police for their co-ordinated work with TTD security, all the HoDs of Tirumala, Sanitary Staffs, Srivari Sevaks and above all the pilgrims for following the Covid guidelines while having Vaikuntha Dwara Darshanam.

The EO lauded the efforts of Additional EO and CVSO in making the event a grand success.

Some excerpts from the media briefing of EO:

DARSHAN:

Total Pilgrims who had Vaikuntha Dwara Darshanam during these ten days registered at 4.26lakhs which included 4,797 donors and 38,339 Virtual Seva pilgrims who were provided Vaikuntha Dwara darshan for the first time.

While among the 2lakh pilgrims who booked Rs.300 Special Entry Darshan in online 1.83lakhs had darshan and among one lakh free tokens issued to locals in Tirupati 90,852 had Vaikuntha Dwara Darshan.  About 10,725 donors of SRIVANI Trust also had darshan.

LADDUS:

A total of 20.80lakhs laddus were distributed to pilgrims which included free (3.94lakhs), small(15.94lakhs) and big(74,982) Laddus and 35,894 Vadas.

REVENUE:

The Srivari Hundial netted Rs.29.09crore for these ten days while a revenue of Rs.2.27crore has been credited in to the coffers of TTD through the booking of 50,894 rooms.

KALYANAKATTA:

A total of 90,290 pilgrims offered their hair including 81,970 men and 8,320 women devotees.

ANNAPRASADAM:

Annaprasadam has been served to 4.52lakh pilgrims in MTVAC, VQC while 77,000 beverages to devotees on Vaikuntha Ekadasi and Dwadasi days only.

APRSRTC:

The APSRTC operated 5210 trips between Tirupati and Tirumala and transported nearly 1.63lakh pilgrims and 5280 trips between Tirumala and Tirupati transporting 1.73lakh pilgrims.

GARDEN:

30 tonnes of traditional flowers and 2lakh cut flowers donated by flower donors were used to decorate temple which won appreciation from pilgrims 

STAFF:

A total of 1000 security guards, 1200 Sanitary Staff, 2000 Srivari Sevakulu offered impeccable services to pilgrims at different points in Tirumala

MEDICAL:

A total of 11,800 pilgrims underwent medication in all the TTD dispensaries and Aswini Hospital present in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

4.26 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమ‌ల‌, 2021 జ‌న‌వ‌రి 04: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 4.26 ల‌క్ష‌ల మంది భక్తుల‌కు స్వామివారి దర్శనం మరియు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన‌ట్టు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. టిటిడి తొలిసారిగా ప్రారంభించిన 10 రోజుల‌ వైకుంఠ ద్వార దర్శనానికి శాస్త్రసహేతుకంగా అంగీకరించిన పీఠాధిపతుల‌కు, తిరుమల‌ పెద్దజీయంగార్‌ మరియు చిన్నజీయంగార్ల‌కు, ఆగమపండితుల‌కు కృతజ్ఞతాభివందనాలు తెలియ‌జేశారు. ఈ 10 రోజుల‌ పాటు భక్తుల‌కు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసి అహర్నిశ‌లు శ్రమించిన ప్రతి ఒక్క టిటిడి ఉద్యోగికి పేరుపేరునా అభినందన‌లు చెప్పారు. 10 రోజులు వైకుంఠ ద్వార దర్శన నిర్ణయానికి గొప్ప ప్రాచుర్యాన్ని, సహకారాన్ని అందించిన మీడియా మాధ్యమాల‌న్నింటికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, టిటిడి భద్రతా సిబ్బందికి, పోలీసుల‌కు, పుష్పాల‌ దాతల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం సాయంత్రం అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టితో క‌లిసి ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

శ్రీవారి ఆల‌యం :

– అలిపిరి మార్గం నుండి 21,350 మంది, శ్రీవారిమెట్టు మార్గంలో 9,789 మంది భక్తులు కాలినడకన స్వామివారిని దర్శించుకున్నారు

– ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300/-) -1.83 ల‌క్ష‌లు

– సర్వదర్శనం టైంస్లాట్‌ – 90,852

– శ్రీవాణి ట్రస్టు  – 10,725

– మొద‌టిసారిగా వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి రోజుల్లో దాత‌ల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించాం. మొత్తం 4,797 మంది దాత‌లు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్నారు.

– వర్చువల్ సేవ‌లు(కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఊంజల్‌ సేవ) – 38,229

– భక్తుల‌కు అందించిన మొత్తం ల‌డ్డూలు 20.80 ల‌క్ష‌లు

– హుండీ కానుక‌లు రూ.29.09 కోట్లు

నిఘా మరియు భద్రతా విభాగం :

– కోవిడ్‌ నిబంధన‌లు పాటిస్తూ 10 రోజుల‌ పాటు  ల‌క్షలాది మంది భక్తుల‌కు సంతృప్తికర దర్శనం.

– 500 మంది శ్రీవారి సేవకులు, 1000 మంది విజిలెన్స్‌ సిబ్బంది భక్తుల‌కు సేవందించారు.

– కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని వీడియో వాల్‌ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించాం.

– తిరుమలోని కౌంటర్లలో 64,572 మంది భక్తుల ల‌గేజిని భద్రపరచడం జరిగింది.

– 93,238 వాహనాల్లో భక్తులు తిరుమల‌కు రావడం జరిగింది.

రిసెప్షన్‌ :

– 10 రోజుల‌కు కలిపి 50,894 గదుల‌ను భక్తులు పొందడం జరిగింది.

– ఇందుకోసం టిటిడికి సమకూరిన ఆదాయం రూ.2.27 కోట్లు.

కల్యాణకట్ట :

– తల‌నీ‌లాలు సమర్పించుకున్న భక్తుల‌ సంఖ్య 90,290. ఇందులో 81,970 మంది పురుషులు, 8,320 మంది మహిళ‌లు.

– 107 మంది మహిళా క్షురకులు, 620 మంది పురుష క్షురకుల‌తో కలిపి మొత్తం 727 మంది క్షురకులు 9 కల్యాణకట్టల్లో భక్తుల‌కు ఉచితంగా తల‌నీలాలు తీయడం జరిగింది.

అన్నప్రసాదం :

– మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కలిపి 4.52 ల‌క్షల‌ భోజనాలు, అల్పాహారం అందించడమైనది.

– 77 వేల‌(వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే) యూనిట్ల పాలు/టీ/కాఫీ భక్తుల‌కు అందించడమైనది.

ఐటి :

– టిటిడి ఐటి విభాగం అధునాతన పరిజ్ఞానంతో వేగవంతమైన సేవ‌లందించడం ద్వారా భక్తులు దర్శనం, వసతి ఇతర సేవల‌ను మరింత సౌకర్యవంతంగా పొందగలిగారు.

ఎపిఎస్‌ఆర్‌టిసి :

– ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమల‌కు 5,210 ట్రిప్పుల్లో 1.63 ల‌క్షల‌ మంది భక్తుల‌ను చేరవేశాయి. తిరుమల‌ నుంచి తిరుపతికి 5,280 ట్రిప్పుల్లో 1.73 ల‌క్షల‌ మంది భక్తుల‌ను చేరవేశాయి.

ఆరోగ్య విభాగం :

– కాటేజీలు, యాత్రికుల‌ వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం 1200 మంది సిబ్బంది సేవల‌ను వినియోగించడమైనది.

– రోజుకు సరాసరి 7 టన్నుల‌ చెత్త తొల‌గింపు.

వైద్యం :

– వైద్యసేవ‌లు పొందిన భక్తుల‌ సంఖ్య 11,800.

ఇంజనీరింగ్‌ విభాగం :

– వాహనదారుల‌ కోసం తిరుమల‌లోని 20 ప్రాంతాల్లో నోపార్కింగ్‌, దారి మళ్లింపు సూచికబోర్డులు, ఏడు పార్కింగ్‌ ప్రదేశాల్లో 100కు పైగా సూచికబోర్డులు ఏర్పాటు.

– శ్రీవారి ఆల‌యం, ఇతర ప్రాంతాల్లో ఆకర్షణీయంగా విద్యుత్ అలంక‌ర‌ణ‌లు.

ఉద్యానవన విభాగం :

– శ్రీవారి ఆల‌యంతోపాటు ప‌లు కూడళ్లు, అతిథిగృహాల‌ వద్ద శోభాయమానంగా పుష్పాలంక‌ర‌ణ‌లు.

– ఇందుకోసం దాత‌ల స‌హ‌కారంతో 30 ట‌న్నుల సంప్ర‌దాయ పుష్పాలు, 2 ల‌క్ష‌ల క‌ట్ ఫ్ల‌వ‌ర్లు వినియోగం.

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమైన ధార్మిక కార్యక్రమాలు :

– డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి, గీతాజయంతి పర్వదినాల‌ను పురస్కరించుకుని దాదాపు 4 గంటల‌ పాటు భగవద్గీత అఖండ పారాయణం నిర్వహణ.

– ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 6 నుండి 6.45 గంటల‌ వరకు – మార్గశీర్షం విష్ణుతత్వం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల‌ వరకు – తిరుప్పావై

– శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి, చెన్నై ట్రిప్లికేన్‌లోని శ్రీ పార్థసారథిస్వామి, భద్రాచ‌లంలోని శ్రీరామచంద్రుని ఆల‌యాల‌ నుండి ఉత్తర ద్వార దర్శనం (వైకుంఠ ఏకాదశి నాడు) ప్రత్యక్ష ప్రసారం.

– శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాయంలో డిసెంబరు 26న శ్రీ వ్రతం, 27న కుబేర వ్రతం.

– జనవరి 2న 8వ విడత అఖండ సుందరకాండ పారాయణం.

– జ‌న‌వ‌రి 8న క‌ర్నూలు న‌గ‌రంలో ధ‌నుర్మాస ల‌క్ష్మీదీపారాధ‌న‌.

– జ‌న‌వ‌రి 14న టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గోదాక‌ల్యాణం.

ప్రజాసంబంధాల‌ విభాగం :

– దేశం న‌లుమూలల‌ నుండి విచ్చేసిన 2000 మంది శ్రీవారి సేవకుల‌తో భక్తుల‌కు సేవ‌లు.

టిటిడి ఆల‌యాల‌కు ప‌టిష్ట భ‌ద్ర‌త : సివిఎస్వో

టిటిడి ప‌రిధిలో మొత్తం 50 ఆల‌యాలు ఉన్నాయ‌ని, వీటి వ‌ద్ద ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి తెలిపారు. 41 ఆల‌యాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని, మిగిలిన 9 ఆల‌యాల్లో జ‌న‌వ‌రి 15వ తేదీనాటికి పూర్తి చేస్తామ‌ని చెప్పారు. జ‌న‌వ‌రి 5వ తేదీ మంగ‌ళ‌వారం నుండి పాప‌వినాశ‌నం మార్గంలో భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌ని వెల్ల‌డించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.