EO AND PRINCIPAL SECRETARY ENDOWMENTS VISITS IT DATA CENTRE IN TTD ADMIN BUILDING_ టిటిడి ఐటి సేవలను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధర్మకర్తల మండలి ఎక్స్‌అఫిషియో సభ్యులు డా. మన్మోహన్‌ సింగ్‌

Tirupati, 29 August 2018: TTD EO Sri Anil Kumar Singhal along with Endowments Principal Secretary and TTD Trust board ex-officio member Dr Manmohan Singh visited the three-tier Data centre which is under construction in TTD administrative building in Tirupati on Wednesday.

Earlier, the Engineering, Audit, IT wings presented the IT related initiative network implemented in their respective departments to EO and Principal Secretary Endowments through power point presentation in IT Meeting Hall. Both the officials of IT wing of TTD and TCS experts team explained to them about the advanced IT services and digitization of departments that are being introduced in various departments of TTD for transparency. FACAO Sri Balaji explained about the payment process in ERP.

Later TTD Chief Engineer Sri Chandra Sekhar Reddy explained the model of Sri Venkateswara Swamy temple that is coming up in 25 acres of land in State capital city, Amaravati in Tullur through power point presentation. He narrated on sanctum sanctorum, Prasadam counters, pushkarini, Potu, Yagashala, Rajagopuram, four-mada streets etc.

Tirupati JEO Sri P Bhaskar, TCS experts including Sri Bhimshekhar, Sri Satya were also present.


ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ఐటి సేవలను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధర్మకర్తల మండలి ఎక్స్‌అఫిషియో సభ్యులు డా. మన్మోహన్‌ సింగ్‌

ఆగస్టు 29, తిరుపతి, 2018: శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా, అత్యంత వేగవంతంగా సేవలు అందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, టిటిడి ధర్మకర్తలమండలి ఎక్స్‌అఫిషియో సభ్యులు డా. మన్మోహన్‌ సింగ్‌ అధికారులను కోరారు.

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోగల ఐటి శాఖ ఛాంబర్‌లో బుధవారం టిటిడిలో ఐటీ సేవలు, నగదు చెల్లింపులు, ఇంజనీరింగ్‌ పనులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సంబంధిత అధికారులు వారికి వివరించారు. అనంతరం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న త్రిటైర్‌ డాటా సెంటర్‌ను పరిశీలించారు.

గత మూడేళ్లుగా టిటిడి అందిస్తున్న ఐటి సేవలను, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా టిటిడి ఐటీ విభాగం, టిసిఎస్‌ అధికారులు వివరించారు. టిటిడిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, వివిధ శాఖలను డిజిటలైజ్‌ చేస్తునట్లు తెలియజేశారు. భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈఆర్‌పీలో నగదు చెల్లింపులపై ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ. బాలాజీ, టిసిఎస్‌ అధికారి భీమ శేఖర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

అనంతరం అమరావతిలోని తుళ్లూరు మండలం, వెంకటపాలెం వద్ద 25 ఎకరాలలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం నమూనాపై చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. గర్భాలయం, అంతరాలయం, అర్దమండపం, గరుడాలయం, శ్రీవారి పోటు, యాగశాల, రాజగోపురంపంతోపాటు ప్రసాదం కౌంటరు, అన్నప్రసాదం హాలు, యాత్రికుల కోసం లాకర్లు, భక్తులు వేచియుండు భవన సముదాయం, పార్కింగ్‌ స్థలం, సిబ్బందికి కార్యాలయ వసతి, సుందరీకరణ, ఉత్సవ మండపం, పరకామణి, అద్దాల మండపం, నాలుగు మాడ వీధులు, శ్రీవారి పుష్కరిణి, ప్రహరీ గోడ తదితర నిర్మాణాలు చేపట్టనున్నట్లు చీఫ్‌ ఇంజనీర్‌ తెలియజేశారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఈడిపి మేనేజర్‌ శ్రీ భాస్కర్‌, ఒఎస్‌డి శ్రీ వెంకటేశ్వర్లు, సాఫ్ట్‌వేర్‌ ఆధికారి శ్రీ నాధముని, టిసిఎస్‌ అధికారి శ్రీ సత్య, లేజర్‌ టీం నుంచి శ్రీ సర్వేష్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.