TTD CANCELS ALL PRIVILEGE DARSHANS DURING BRAHMOTSAVAMS_ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో వివిధ ప్రత్యేక ద్రర్శనాలు రద్దు

Tirumala, 29 August 2018: Keeping in view the heavy pilgrim influx during twin brahmotsavams, occurring in September and October respectively, TTD has cancelled all privilege darshans during that period.

In the month of September from 12th to 21st, all the privilege darshans including aged and physically challenged, parents with infants, donors, VIP break etc. are cancelled while in October from 9th till 18th also all the above darshans are cancelled.

The pilgrims are requested to make note of the changes made by TTD in view of the general pilgrim crowd during Brahmotsavams.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో వివిధ ప్రత్యేక ద్రర్శనాలు రద్దు

తిరుమల, 2018 ఆగస్టు 29: తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను సెప్టెంబరు, అక్టోబరు నెలలో ఆయా తేదీలలో టిటిడి రద్దు చేసింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

ఇందులో భాగంగా సెప్టెంబరు 12 (అంకురార్పణం) నుండి 21వ తేదీ వరకు మరియు అక్టోబరు 9 (అంకురార్పణం) నుండి 18వ తేదీ వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సం|| లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు, దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతున్నది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.