EO ENQUIRES THE DEVOTEES _ శ్రీవారి వాహన సేవలలో కళాబృందాలపై భక్తుల అభిప్రాయం తెలుసుకున్న టిటిడి ఈవో
TIRUMALA, 07 OCTOBER 2024: TTD EO Sri J Syamala Rao interacted the devotees in galleries to know about their feedback. While appreciating the art forms a few devotees suggested that more art forms can be displayed to reduce the distance between each group.
“Devotees enjoy the different art forms waiting in the galleries of Mada streets till the Vahanam comes. So the gap between the groups shall be reduced and more teams can be included so that it enhances the spiritual grandeur”, a devotee Smt Sharada from Visakhapatanam expressed.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి వాహన సేవలలో కళాబృందాలపై భక్తుల అభిప్రాయం తెలుసుకున్న టిటిడి ఈవో
తిరుమల, 2024 అక్టోబరు 07: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం జరిగే వాహన వాహన సేవలలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాలపై గ్యాలరీలలోని భక్తులతో మమేకమై వారి అభిప్రాయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు.
శ్రీవారి కల్పవృక్ష వాహన సేవలో సోమవారం ఉదయం ఈవో కొంతమంది భక్తులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కొందరు భక్తులు కళారూపాలను మెచ్చుకుంటూ, ప్రతి సమూహం మధ్య దూరాన్ని తగ్గించడానికి మరిన్ని కళాబృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
“వాహనం వచ్చే వరకు మాడ వీధుల్లోని గ్యాలరీలలో వేచి ఉన్న విభిన్న కళారూపాలను భక్తులు ఆస్వాదిస్తారన్నారు. కాబట్టి సమూహాల మధ్య అంతరం తగ్గించి, ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపొందించడానికి మరిన్ని జట్లను చేర్చవచ్చు” అని విశాఖపట్నం నుండి వచ్చిన శ్రీమతి శారద అనే భక్తురాలు ఆయనకు తెలిపారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.