EO INSPECTS JUBILEE HILLS TEMPLE _ హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
TIRUPATI, 24 FEBRUARY 2025: TTD EO Sri J Syamala Rao on Monday inspected the ongoing arrangements for the conduct of annual brahmotsavams in Sri Venkateswara Swamy temple at Jubilee Hills which will commence from February 26 onwards.
He instructed the temple and engineering officials to make necessary facilities keeping in view the comfort of devotees and also observed the development works.
AEO Sri Ramesh and other officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
- oplus_1048608
- oplus_11534368
వైభవంగా జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
• ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
తిరుపతి, 2025 ఫిబ్రవరి 24: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 6వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు సోమవారం రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం అంకురార్పణ, ఫిబ్రవరి 26న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మార్చి 2న గరుడ వాహనం, మార్చి 5న రథోత్సవం, మార్చి 6న చక్రస్నానం నిర్వహించనున్నట్లు చెప్పారు.
శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్ధుతున్నారన్నారు.
అంతకుముందు ఈవో, ఆధికారులతో కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.